Home

»

Latest News

Virosh Haldi: విజయ్-రష్మిక హల్దీ హంగామా.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు!

Mar 17, 2026 2:10PM

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) ఫిబ్రవరి 26న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ఈ జంట, తమ పెళ్లికి సంబంధించిన ఒక్కో వేడుక ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఈ స్టార్ కపుల్ తమ హల్దీ వేడుకకు సంబంధించిన అద్భుతమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. (ViRosh Haldi)

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 25న ఈ హల్దీ ఈవెంట్ అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో విజయ్, రష్మిక ఇద్దరూ పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. ఒకరిపై ఒకరు పసుపు నీళ్లు చల్లుకుంటూ ఎంతో సరదాగా గడిపిన క్షణాలు ఈ ఫోటోలలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com