English | Telugu

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీ కోసం మహేష్ ఫాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ మూవీ నుంచి కొన్ని రోజుల క్రితం దం మసాలా సాంగ్ విడుదల అయ్యి సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది. తాజాగా కొంచెం సేపటి క్రితమే ఇంకో సాంగ్ రిలీజ్ అయ్యింది.

రెండు రోజుల క్రితం మహేష్ బాబు తాను నటిస్తున్న గుంటూరు కారం నుంచి ఓ మై బేబీ అనే లిరికల్ తో కూడిన సాంగ్ ప్రోమో ని విడుదల చేసాడు. ఆ ప్రోమో చూసిన వాళ్లందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ పాట పూర్తిగా వస్తుందా అని ఎదురుచూసారు. ఇప్పుడు ఓ మై బేబీ సాంగ్ ని మేకర్స్ విడుదల చేసారు. సాంగ్ మొత్తం సూపర్ గా ఉంది.థమన్ మ్యూజిక్ అదిరిపోయింది. అలాగే రామజోగయ్య రచనా సాహిత్యంలో వచ్చిన ఈ  సాంగ్ లోని పదాలన్ని కూడా చాలా క్యాచీగా ఉన్నాయి. ఈ పాట మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. విని ఆనందించండి .

 

ఈ గుంటూరు కారం లో మహేష్  సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి లు కథనాయికలుగా నటిస్తున్నారు. జగపతిబాబు ,ప్రకాష్ రాజ్ ,రమ్య కృష్ణ, ముఖేష్ రిషి కీలక పాత్రలని పోషిస్తున్నారు.