Home

»

Latest News

వివాదాల అమ్మడు షాకింగ్ నిర్ణయం!

Jan 4, 2023 9:04AM

రాధిక ఆప్టే గురించి తెలియని వారు ఉండరు. హిందీ, తమిళ్ చిత్రాల్లో నటించినప్పటికీ తెలుగులో కూడా ఒక నాలుగు ఐదు చిత్రాలు చేసింది. నందమూరి నట‌సింహ బాలకృష్ణతో లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తమిళంలో  రజినీకాంత్ సరసన కబాలి చిత్రంలో యాక్ట్ చేసింది. తెలుగులో లెజెండ్, ల‌య‌న్‌ల‌తోపాటు ఆమె రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2, ధోని వంటి చిత్రాలు చేసింది. హిందీ, ఇంగ్లీష్, మలయాళం, మరాఠీ, బెంగాలీ వంటి పలు భాషల్లో నటించిన ఈమె సౌత్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి పేరు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు తాను నటించిన హీరోలపై విమర్శలు చేయడం ద్వారా పలు సార్లు వార్తల్లో నిలిచిన విషయం అందరికీ విధితమే. 

సౌత్ లో హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంటుందని, వారు హీరోయిన్స్ కు  గౌరవం ఇవ్వ‌ర‌ని  తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. అంతేకాదు నన్ను ఒక పెద్ద హీరో ఇబ్బంది పెట్టాడు. ఆయన రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి అని ప్రకటన చేసింది. దాంతో అందరూ ఆమె నటించిన తెలుగు చిత్రాలను తమిళ చిత్రాలను తిరగేశారు. వాటిల్లో పెద్ద హీరోలతో ఆమె న‌టించిన చిత్రాలు  తమిళంలో రజినీకాంత్ క‌బాలి, తెలుగులో బాలకృష్ణ లెజెండ్‌, ల‌య‌న్ చిత్రాలు  మాత్రమే. మరోవైపు ఆమె అదే ఇంటర్వ్యూలో రజనీకాంత్ చాలా మంచి వాడ‌ని స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో ఇండైరెక్ట్ గా ఆమె ఏ హీరో గురించి మాట్లాడుతున్నదో కొందరికి బాగానే అర్థమైంది. దాంతో  వారు ఆమెపై మండిపడ్డారు. చేసేటప్పుడు మాత్రం పరిగెత్తుకునే ఛాన్స్ వచ్చింది కదా అని చేసి తర్వాత ఇలా అపనిందలు వేయడం సరైన ప‌ద్ద‌తి కాదంటూ  ఆమెపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లు హీరోయిన్‌గా నటించిన రాధిక ఆప్టే సడన్‌గా దర్శకురాలిగా మారాలని భావిస్తోంది. 

రాధిక ఆప్టే హీరోయిన్ అవ్వాలని అనుకోలేదని దర్శకురాలు అవ్వాలనే ఉద్దేశంతో డైరెక్షన్లో శిక్షణ కూడా తీసుకుందట. కానీ అనూహ్యంగా హీరోయిన్‌గా ఛాన్స్ రావడంతో  న‌టిని అయ్యాన‌ని, దర్శకురాలు అవ్వాలనే  కోరిక తనలో ఇంకా ఉందని రాధిక ఆప్టే తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది. త్వరలో నేను దర్శకురాలిగా ఒక సినిమా చేయబోతున్నానని ప్రకటించింది. ప్రస్తుతం స్క్రిప్టు రైటింగ్ కోసం సీనియర్ దర్శకుల వద్ద సలహాలు, సూచనలు తీసుకుంటూ వారికి అసిస్టెంట్‌గా వ్యవహరిస్తుంది. భవిష్యత్తులో తన దర్శకత్వంలో సినిమాలు వస్తాయని ఆమె ధీమాగా చెప్తుంది. దర్శకురాలిగా మారినంత మాత్రాన నటిగా తన న‌ట‌నా కెరీర్ కు   గుడ్ బై చెప్పబోను అని క్లారిటీ ఇచ్చింది. 

తన మొదటి ప్రాధాన్యం నటనే అని దర్శకత్వం అనేది తనకు ఆసక్తి కనుక చేయాలనుకున్నట్టుగా రాధిక ఆప్టే పేర్కొంది. పెట్టిన రోజు పెళ్లి కూడు.. పెట్ట‌క‌పోతే  శార్దపకూడు  అన్నట్టుగా ఈరోజు అవకాశం ఇస్తే వాళ్లు మంచివారు ఇవ్వకపోతే వారు వెధవలు అన్న‌ది ఈమె ధోర‌ణి. దర్శకులుగా సీనియర్ దర్శకులు తనకు శిక్ష‌ణ  ఇస్తే మంచివారు ఇవ్వకపోతే కమిట్మెంట్ అడిగేవారు అన్నట్టుగా ఉంటుంది రాధిక ఆప్టే తీరు. అందుకే ఆమెతో కాస్త  జాగ్రత్తగా ఉండాలి సుమా అంటున్నారు బాలీవుడ్ జనాలు...!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com