Home

»

Latest News

ఆ వ్యక్తితో చెప్పులు మోయించిన హీరోయిన్ రెజీనా.. వైరల్ వీడియోపై విమర్శల జోరు

Aug 27, 2026 3:02PM


తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న భామ  రెజీనా కసాండ్రా. ఈ అమ్మడి ఖాతాలో హిట్స్ కి కూడా కొదవ లేదు. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొంతమంది నెటిజన్లు   రెజీనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 రెజీనా ఇటీవల ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైంది. అందుకు సంబంధించిన వీడియోలో రెజీనా నడుచుకుంటూ వెళ్తుంటే, ఆమె అసిస్టెంట్ రెజీనా కాళ్ళ చెప్పులని  చేతిలో పట్టుకుని ఆమె వెంటే నడుస్తూ కనిపించాడు. రెజీనా చెప్పులనే ఎందుకు అంటున్నారంటే ఆ సమయంలో ఆమె కాళ్ళకి చెప్పులు లేకపోవడంతో పాటు అసిస్టెంట్ పట్టుకున్న చెప్పులు రెజీనావి అని అర్ధమవుతుంది.  ఈ దృశ్యాలు నెటిజన్ల దృష్టికి రావడంతో క్షణాల్లో వైరల్‌గా మారాయి. దాంతో సదరు వీడియోను రీషేర్ చేస్తూ అనేకమంది నెటిజన్లు రెజీనా ప్రవర్తనను తీవ్రంగా తప్పుపడుతున్నారు. "ఇలాంటి అహంకారపూరిత వైఖరి అస్సలు సరికాదు" అని కొందరు వ్యాఖ్యానిస్తుంటే, "గతాన్ని, మూలాలను మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు" అని మరికొందరు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు.  సినీ పరిశ్రమలో 10 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉండి, తమిళం, తెలుగు, హిందీ బాషలలో 30 కి పైగా సినిమాల్లో నటించి వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఒక ప్రముఖ నటి నుండి ఇలాంటి సీన్ ఊహించలేదని కామెంట్లు పెడుతున్నారు. దాదాపు 10 సెకన్ల వ్యవధి ఉన్న ఈ వీడియో క్లిప్ ఆధారంగానే ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 


Also Read: టాక్సిక్ డివైడ్ టాక్.. దిల్ రాజుకి 100 కోట్ల నష్టమా!


అయితే ఈ వివాదంపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు రెజీనాకు మద్దతుగా నిలుస్తూ.. కేవలం కొన్ని సెకన్ల వీడియో క్లిప్‌ను చూసి ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం భావ్యం కాదని అంటున్నారు. ఈ సంఘటన వెనుక అసలు సందర్భం ఏంటో, అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలియకుండా తీర్పులు ఇవ్వకూడదని స్పష్టం చేస్తున్నారు.  ఆ సమయంలో ఆమె వేసుకున్న డ్రెస్ లేదా ఎత్తైన హీల్స్ వల్ల నడవడానికి ఇబ్బంది కలిగి చెప్పులు తీసేసి ఉండవచ్చని, అసిస్టెంట్ కేవలం సహాయం మాత్రమే చేసి ఉంటారని అభిమానులు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరల్ వీడియో నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కానీ ఇప్పటివరకు ఈ ట్రోలింగ్ మరియు విమర్శలపై నటి రెజీనా కసాండ్రా స్పందించలేదు. ఆమె వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు నయనతార ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న 'మూకుత్తి అమ్మన్ 2'  మూవీలో  రెజీనా ఒక శక్తివంతమైన విలన్ రోల్ లో మెస్మరైజ్ చేయనుంది.

Regina Cassandra, Mookuthi Amman 2, Tollywood, TeluguCinema, TeluguNews, TeluguCinemaNews ,TeluguOneDotCom

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com