Home  »  News  »  'శ్రీనివాస మంగాపురం' కోసం రంగంలోకి మహేష్ బాబు.!

Updated : Jul 28, 2026

సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మరో కొత్త కెరటం వెండితెరపైకి అడుగుపెడుతోంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ రస్టిక్ అండ్ ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ డ్రామాకు 'ఆర్‌ఎక్స్ 100', 'మంగళవారం' వంటి సంచలన చిత్రాలను అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 30న థియేటర్లలోకి రాబోతోంది.

సినిమా గ్రాండ్ రిలీజ్ సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లలో వేగం పెంచింది. ఈ క్రమంలోనే హీరో జయకృష్ణ ఘట్టమనేని, దర్శకుడు అజయ్ భూపతి కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబును ప్రత్యేకంగా కలిశారు. జయకృష్ణ తన బాబాయ్ మహేష్ బాబుతో అనుబంధాన్ని ఎప్పుడూ పంచుకుంటూ ఉంటారు. చిత్రం పట్ల, జయకృష్ణ నటన పట్ల బాబాయ్ చూపుతున్న ఆప్యాయత, మద్దతు ఆయనకు కొండంత బలాన్ని ఇస్తోంది. 

ఈ భేటీలో మహేష్ బాబు 'శ్రీనివాస మంగాపురం' టీమ్‌కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా, సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు. జయకృష్ణ ఈ పాత్ర కోసం పడిన శ్రమను, అజయ్ భూపతి మేకింగ్ విజన్‌ను సూపర్ స్టార్ ప్రత్యేకంగా అభినందించారు.

తిరుపతి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ నటిస్తుండగా, సీనియర్ నటుడు మోహన్ బాబు వెంకటప్పయ్య నాయుడు అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు. జులై 30న విడుదల కానున్న ఈ సినిమా హీరో జయకృష్ణ కెరీర్‌కు బలమైన పునాదిగా నిలుస్తుందని, బాబాయ్ మహేష్ బాబు ఆశీస్సులు సినిమాకు గొప్ప పాజిటివ్ వైబ్‌ను తీసుకువచ్చాయని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 

 

 

Mahesh Babu, Srinivasa Mangapuram, Jaya Krishna Ghattamaneni

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.