Home

»

Latest News

జక్కన్న మహేష్ చిత్రానికి విదేశీ నిర్మాణ సంస్థ పెట్టుబడులు!

Jan 3, 2023 9:07AM

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి క్రేజ్ సినిమా సినిమాకు విపరీతంగా పెరుగుతుంది. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది క‌న్‌క్లూజ‌న్ చిత్రాల త‌ర్వాత  ఆయ‌న త‌దుప‌రి చిత్రం చాలా పెద్ద రేంజిలో ఉంటుందని అందరూ ఊహించారు. వారి ఊహలకు తగ్గట్టుగానే ఏ మాత్రం అంచనాలకు తగ్గకుండా ఆర్ఆర్ఆర్ సినిమా తీసి  వావ్ అనిపించారు జక్కన్న. ఈ చిత్రాన్ని హాలీవుడ్ వారు సైతం మెచ్చుకునే విధంగా ఆయన తెరకెక్కించిన విధానం అందర్నీ విపరీతంగా ఆకర్షించింది. ఆస్కార్‌ నామినేషన్స్ కు పోటీపడి తీవ్రంగా ప్రయత్నించిన  జక్కన్న ఆస్కార్ కోరిక నెరవేరకపోయినా తాను అనుకున్నది మాత్రం సాధించారు.  

ఈ చిత్రం ద్వారా హాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  అంతర్జాతీయ మీడియా ముందు పలుసార్లు జక్కన్న మాట్లాడారు. ఈ చిత్రం విజువల్స్ ను అంతర్జాతీయ మీడియాకు ప్రధానంగా చూపించాడు. దాంతో హాలీవుడ్ ఫిలిం మేకర్స్ నుంచి మొదలుకొని అంత‌ర్జాతీయ స్థాయి న‌టీన‌టులు, టెక్నీషియ‌న్ల‌తో   జక్కన్నకు పరిచయం ఏర్ప‌డింది.  అదే ఆయ‌న‌కు  బాగా  కలిసి వ‌చ్చే అవ‌కాశం ఉంది.  హాలీవుడ్కు చెందిన పలు నిర్మాణ సంస్థలు రెండు మూడు రాజమౌళితో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ భాషల్లో అయినా పర్వాలేదు... ఇంగ్లీషులో అయినా పరవాలేదు... రాజమౌళితో సినిమా తీయడమే లక్ష్యంగా ఆ సంస్థలు పోటీ పడుతున్నాయట. రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కేఎల్ నారాయణ నిర్మాత. ఇందులో భాగస్వామిగా ఉండేందుకు ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ పోటీపడుతుంది.

హాలీవుడ్ నిర్మాణ సంస్థల భాగస్వామ్యం అంటే సహజంగానే డాలర్లు వ‌ర్షం పెట్టుబ‌డిగా కురుస్తుంది.  అప్పుడు సినిమా రేంజ్ అమాంతంగా పెరగడం ఖాయం. మొత్తానికి ఆస్కార్‌ దక్కుకున్న జక్కన్నకు హాలీవుడ్లో గౌరవం, గుర్తింపు ద‌క్క‌డం  విశేషం. ప్రమోషన్స్లో జక్కన్న తీరే వేరు., తనను ప్రాజెక్టు చేసుకుంటూనే తన సినిమాను ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలో ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని చెప్పాలి. ఈ విష‌యంలో బిజినెస్ దిగ్గ‌జాలు కూడా ఆయ‌న‌కు సరిరారు.  దాంతో   ఆయన టాలెంట్ ముందు బడా బడా దర్శకులు కూడా దిగ‌దుడుపేన‌ని చెప్పవచ్చు...జ‌క్క‌న్న‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలాఉంద‌ని విశ్లేష‌కులు నొక్కి వ‌క్కాణిస్తున్నారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com