Home

»

Gossips

మహేష్ సిస్టర్‌గా ఎన్టీఆర్ బయోపిక్ హీరోయిన్?

Sep 16, 2020 11:29AM

 

సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ సిస్టర్‌గా నటించనుందా? అంటే అవునని సమాధానం వినబడుతోంది. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటించనున్న సినిమా 'సర్కారు వారి పాట'. దీనికి పాన్ ఇండియన్ ఫిల్మ్ లుక్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారట.

ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ని సంప్రతిస్తున్నారు. అలాగే, సినిమాలో కీలకమైన మహేష్ సిస్టర్ పాత్రకు విద్యా బాలన్ ను తీసుకుంటే బావుంటుందని భావిస్తున్నారట. మహేష్ శ్రీమతి నమ్రతకు బాలీవుడ్ ప్రముఖులతో మంచి పరిచయాలు ఉన్నాయి. అందుకని, ఆమె ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారట.  

తెలుగు సినిమా ప్రేక్షకులకూ విద్యా బాలన్ తెలుసు. సిల్క్ స్మిత బయోపిక్ 'ది డర్టీ పిక్చర్'తో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల చేత 'ఊలాలా ఉల్లాలా' అంటూ స్టెప్పులు వేయించారు. అంతకు ముందు, ఆ తరవాత పలు చిత్రాల్లో నటిగా తనను తాను నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆమె నటించిన తొలి స్ట్రయిట్ తెలుగు సినిమా అది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com