Home

»

Gossips

త‌మ‌న్ ఖాతాలో రామ్ - బోయ‌పాటి చిత్రం!?

Feb 19, 2022 11:49AM

ప్ర‌స్తుతం తెలుగునాట యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ హ‌వా న‌డుస్తోంది. `గాడ్ ఫాద‌ర్`, `NBK 107`, `భీమ్లా నాయ‌క్`,  `స‌ర్కారు వారి పాట‌`, `SSMB 28`, `RC 15`, `రాధే శ్యామ్` (నేప‌థ్య సంగీతం), `థాంక్ యూ`.. ఇలా ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ త‌మ‌న్ చేతిలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే, తాజాగా మ‌రో భారీ బ‌డ్జెట్ మూవీకి త‌మ‌న్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. మాస్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను - ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేష‌న్ లో ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ రూపొందనున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో తెర‌కెక్క‌నున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని శ్రీ‌నివాస చిట్టూరి నిర్మించ‌నున్నారు. కాగా, ఈ చిత్రానికి త‌మ‌న్ బాణీలు అందించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

కాగా, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఇప్ప‌టికే `స‌రైనోడు`, `అఖండ‌` వంటి సెన్సేష‌న‌ల్ మూవీస్ కి మ్యూజిక్ అందించాడు త‌మ‌న్. ఇక రామ్ కాంబోలో `కందిరీగ‌`, `మ‌సాలా`, `పండ‌గ చేస్కో` వంటి సినిమాల‌కి స్వ‌రాలు స‌మ‌కూర్చాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com