Home

»

Gossips

సాయి పల్లవికి పొగరు తలకెక్కింది!

Dec 6, 2017 4:11PM

అవును.. ’సాయిపల్లవికి పొగరు తలకెక్కింది. ఎంత గర్వం! లైఫ్ ఇచ్చిన వారికే ‘నో’ చెబుతుందా!’..... ఫిలింనగర్ లో చాలామంది సాయిపల్లవి గురించి ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు నిదానంగా ఆ అమ్మాయి చెవున కూడా పడ్డాయట. పాపం.. ఏం చే్స్తుంది. నిజంగానే బాధపడిందట. విషయం ఏంటంటే...

‘ఫిదా’ విజయంతో సాయిపల్లవి క్రే్జ్ ఆకాశమంత ఎత్తుకు చేరుకుంది. వెంటనే. ‘ఎంసీఏ’ సినిమాలో  కూడా నిర్మాత దిల్ రాజు ఆమెనే కథానాయికగా నటింపజేశాడు. అయితే... ‘ఏంసీఏ’ సినిమా షూటింగ్లో సాయిపల్లవిలో క్రమశిక్షణ, పనిమీద శ్రద్ధ, ప్రతిభ, డెడికేషన్ చూసి.. దిల్ రాజు ‘ఫిదా’ అయిపోయాడట. అందుకే... వేగేశ్న సతీశ్ దర్శకత్వంలో నితిన్ కథానాయకునిగా తాను నిర్మించనున్న ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలో కూడా కథానాయిక నటించాలని సాయిపల్లవిని అడిగాడట దిల్ రాజు. అయితే... ఆయన ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిందట సాయిపల్లవి. కారణం ఆమెకు డేట్స్ లేకపోవడమే. 

ఇప్పటికే తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న సాయిపల్లవి, తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంది. అందుకే... దిల్ రాజు సినిమాకు ‘ఓకే’ చెప్పలేకపోయిందని తెలిసింది. అయితే... కేవలం ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలోని పాత్ర నచ్చకే.. ఆమె ‘నో’  చెప్పిందనీ... డేట్స్ ఖాళీ లేకపోవడం ఉత్తి మాటే అని చాలామంది అంటున్నారు. మరి వీటిలో ఏది నిజమో.. ఆ దేవుడికి, సాయిపల్లవికే తెలియాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com