Home

»

Gossips

అతనికి ఇచ్చిన మాట కోసం

Jan 25, 2018 11:39AM

ఇక సినిమాలకు స్వస్తి. మిగతా జీవితమంతా ప్రజలకోసమే.. అని ప్రజల సాక్షిగా ప్రకటించారు పవన్. దాంతో ‘అజ్ఙాతవాసి’ సినిమానే పవన్ చివరి సినిమా అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే.. అనూహ్యంగా మళ్లీ పవర్ స్టార్ సినిమా చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి గతంతో ఎప్పుడో ఓ సినిమా చేస్తానని మ ాటిచ్చాడు పవన్. కొన్నేళ్ల క్రితమే పవన్ కి జానీ మాస్టర్ ఓ కథ వినిపించాడు. కథ బాగున్నా... దర్శకునిగా అనుభవం లేకపోయేసరికి ‘కాస్త పరిణతి సాధించిన తర్వాత సినిమా చేద్దుగాని’ అని మాటిచ్చాడు పవన్. ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి జానీ మాస్టర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. కథ కూడా పవన్ కి నచ్చినట్లు సమాచారం. 

అయితే...ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... ఇందులో పవన్ నటించడు. కేవలం నిర్మాత మాత్రమే. హీరో ఎవరు? అనేది ఇంకా డిసైడ్ కాలేదు. ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ లో సినిమా ఉంటుంది. ఇప్పటికే ఇదే బ్యానర్ లో నితిన్ హీరోగా పవన్ ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

దీన్ని బట్టి.. అర్థమవుతున్న విషయం ఏంటంటే... పవన్ హీరో పాత్రలు మాత్రమే చేయడన్నమాట. సినిమాలు చేస్తాడన్నమాట. అదండీ విషయం. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com