![]() |
![]() |

రీసెంట్ గా 'ఆంధ్ర కింగ్ తాలూకా'తో ప్రేక్షకులను పలకరించాడు హీరో రామ్ పోతినేని. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతోంది. ఇదిలా ఉంటే, రామ్ తన తదుపరి సినిమా కోసం పవన్ కళ్యాణ్ దర్శకుడితో చేతులు కలుపుతున్నట్లు తెలుస్తోంది.
నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సముద్రఖని. దర్శకుడిగా తెలుగులో రవితేజతో 'శంభో శివ శంభో', పవన్ కళ్యాణ్ తో 'బ్రో' వంటి సినిమాలు చేశారు. డైరెక్టర్ గా తన నెక్స్ట్ మూవీని రామ్ తో చేయబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.
Also Read: బిగ్ సర్ ప్రైజ్.. 'అఖండ-2'లో చిరంజీవి..!
రామ్-సముద్రఖని కాంబినేషన్ లో రూపొందనున్న ఈ సినిమాని కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుందట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అంటున్నారు.
ఆ మధ్య వరుసగా మాస్ సినిమాలు చేసిన రామ్.. రూట్ మార్చి 'ఆంధ్ర కింగ్ తాలూకా' చేశాడు. ఇప్పుడు సముద్రఖని దర్శకత్వంలో సినిమా అంటే.. కంటెంట్ పరంగా వైవిధ్యం ఉంటే ఛాన్స్ ఉంది.
![]() |
![]() |