Home

»

Gossips

ప్రెగ్నెంట్ గా స‌మంత‌!?

Jan 17, 2022 4:27PM

క‌థ‌ న‌చ్చాలే కానీ త‌ల్లి పాత్ర‌ల్లోనూ న‌టించేందుకు వెనుకాడ‌ని ఈత‌రం కథానాయిక‌ల్లో స‌మంత ఒక‌రు. ఆమ‌ధ్య `మ‌నం` (2014)లో అమ్మ‌గా మురిపించిన సామ్.. ఆపై త‌మిళ చిత్రం `తెరి` (తెలుగులో `పోలీస్`) (2016)లోనూ కాసేపు త‌ల్లిగా క‌నిపించింది. క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో మరోమారు స‌మంత మ‌ద‌ర్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌బోతోంద‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం స‌మంత `య‌శోద‌` పేరుతో ఓ పాన్ - ఇండియా మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కులు హ‌రి - హ‌రీశ్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ‌దేవి మూవీస్ నిర్మిస్తోంది. ఇందులో `క్రాక్` ఫేమ్ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కూడా ఓ ముఖ్య పాత్ర‌లో ఎంట‌ర్టైన్ చేయ‌నుంది. ఇదిలా ఉంటే.. `య‌శోద‌`లో న‌ర్స్ గా సామ్ క‌నిపించ‌బోతోంద‌ని గ‌త కొద్దిరోజులుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే, అది నిజ‌మేన‌ని తెలిసింది. అంతేకాదు.. క‌థానుసారం ఆమె ప్రెగ్నెంట్ గా కాసేపు, త‌ల్లిగా మ‌రి కొంతసేపు ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని అంటున్నారు. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, ఈ ఏడాది ద్వితీయార్ధంలో `య‌శోద‌` సిల్వ‌ర్ స్క్రీన్ పైకి రానుంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com