మరోసారి 'రాజా సాబ్' వాయిదా.. క్లారిటీ వచ్చేసింది!
on Nov 4, 2025

'రాజా సాబ్' వాయిదా అంటూ వార్తలు
మేకర్స్ కీలక ప్రకటన
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' మూవీ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్.. నిజానికి 2025 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ, వీఎఫ్ఎక్స్ వర్క్ తో ముడిపడిన సినిమా కావడంతో పలుసార్లు విడుదల తేదీ మారుతూ వచ్చింది. (The Raja Saab)
'ది రాజా సాబ్' మొదట 2025 ఏప్రిల్ కి వాయిదా పడింది. ఆ తర్వాత డిసెంబర్ కి, అటు నుండి 2026 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయింది. 2026 జనవరి 9న 'రాజా సాబ్' ఖచ్చితంగా విడుదలవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. విడుదలకు ఇంకా రెండు నెలలే సమయం ఉండగా.. ఇలాంటి తరుణంలో మరోసారి 'రాజా సాబ్' వాయిదా అంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక ప్రకటన చేశారు.
"ఫుల్ స్వింగ్ లో 'రాజా సాబ్' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అనుకున్న ప్రకారమే జనవరి 9న 'రాజా సాబ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది." అని తెలిపారు మేకర్స్. దీంతో, మరోసారి మూవీ వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారనికి చెక్ పెట్టారు.
Also Read: ప్రభాస్ తో సంథింగ్ స్పెషల్.. మహేష్ గురించి ఆ సీక్రెట్..!
ప్రస్తుతం 'రాజా సాబ్' సినిమాకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. డిసెంబర్ లో యూఎస్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపనున్నారు. డిసెంబర్ 25 లోగా ఫస్ట్ కాపీ రెడీ చేయబోతున్నారు.
'రాజా సాబ్' విడుదల తేదీలో మార్పు లేదని నిర్మాతలు క్లారిటీ ఇవ్వడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



