మెగా ఫ్యామిలీ నుంచి కార్తీకి ఊహించని ట్వీట్..ఇంత ధైర్యం ఎవరు చేసుంటారు
on Sep 26, 2024
తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్(pawan kalyan)కి ప్రముఖ హీరో కార్తీ(karthi)క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే.దీంతో లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ మేనల్లుడు ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ కార్తీని ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సాయిధరమ్ తేజ్(sai dharam tej)కొన్ని రోజుల క్రితం తన పేరులో తన తల్లి పేరు వచ్చేలా సాయి దుర్గాతేజ్ గా మార్చుకున్న విషయం తెలిసిందే.ఇప్పుడు ఆ పేరుతోనే కార్తీ అప్ కమింగ్ మూవీ సత్యం సుందరం ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసాడు. అద్భుతమైన చిత్రం సత్యం సుందరం(satyam sundaram)ఈ నెల 28న థియేటర్స్ లో విడుదల కానుంది.మనసుకి హత్తుకునే చిత్రాలని తెరకెక్కించే దర్శకుడు ప్రేమ్ కుమార్(prem kumar)కార్తీ అన్న కాంబోలో ఈ సినిమా రూపుదిద్దుకోవడం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది.అరవింద్ స్వామి(aravind swamy)సూర్య, జ్యోతిక తో పాటు చిత్ర బృందం మొత్తం మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
తేజ్ చేసిన ఈ ట్వీట్ కి కార్తీ కూడా రిప్లై ఇచ్చాడు.బ్రదర్,ప్రేమ ఆప్యాయతతో మీరెప్పుడు మంచి మనసు చాటుకుంటారు. మీ విషెస్ కి ధన్యవాదాలు అంటూ చెప్పాడు.ఈ రెండు ట్వీట్ లు కూడా ఇప్పుడు సినీ ప్రియులని ఆకర్షిస్తున్నాయి. సత్యం సుందరం ని 2 డి ఎంటర్ టైన్మేంట్ పై కార్తీ సోదరుడు సూర్య(surya)జ్యోతిక(jyothika)లు నిర్మిస్తున్నారు.ఒక పెళ్లి వేడుకలో అనుకోకుండా కలుసుకున్న సత్యం, సుందరం అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక రాత్రిలో జరిగే కథగా సత్యం సుందరం మూవీ తెరకెక్కింది.
Also Read