మంచు విష్ణు సంచలన ప్రెస్ మీట్..మా నాన్న ఒక తప్పు చేసాడు
on Dec 11, 2024
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(mohan babu)ఆయన కుమారుడు మనోజ్(manoj)మధ్య గత రెండు రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఆస్తులకి సంబంధించిన విషయంలో గొడవ జరుగుతుందని మొదట్లో అందరు అనుకున్నా కూడా నిన్న మనోజ్ చెప్పిన విషయంతో ఆస్తుల గొడవ కాదని తేలిపోయింది.ఇక నిన్న రాత్రి మనోజ్ జల్లేపల్లి లోని మోహన్ బాబు నివాసానికి వెళ్లి తన కూతుర్ని చూపించాలని గొడవ చేసాడు.ఆ సమయంలో మనోజ్ షర్ట్ కూడా చినిగిపోవడం, మనస్తాపంతో మోహన్ బాబు హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక మా నాన్న దేవుడని అసలు గొడవకి కారణం ఏంటో ఈ రోజు సాయంత్రం ఐదున్నర కి మీడియా సముఖంగా చెప్తానని మనోజ్ చెప్పాడు.
అలాంటి టైం లో ఇప్పుడు విష్ణు(vishnu)గచ్చిబౌలీలోని హాస్పిటల్ నుంచి మాట్లాడుతూ ఇలాంటి మీటింగ్ పెడతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ప్రత్యేకించి మా కుటుంబం గురించి ఇలా మాట్లాడతానని అనుకోలేదు.నాన్న గారికి మీడియా అంటే ఎంతో గౌరవం.ప్రతి కుటుంబంలోను ఇష్యుస్ ఉంటాయి. ఇళ్లలోని పెద్దలు ఎవరో ఒకరు తగ్గడంతో ఇష్యుస్ తగ్గాలని కోరుకుంటారు.ఎక్కువ మాట్లాడితే ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అయ్యేలా ఉన్నాను.మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉందంటే మా అందర్నీ విపరీతంగా ప్రేమించడం. ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న ఈ విషయం అందరకి తెలుసు.మీడియా వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటారు.అందరి కంటే భిన్నంగా మేము ఉమ్మడి కుటుంబంగా ఉంటామని అనుకున్నాను.కానీ మా గొడవల్ని సెన్సేషన్ చెయ్యవద్దు. మా అమ్మ గారికి కూడా ఆరోగ్యం బాగోలేదు.నిన్న జరిగిన గొడవలో మా నాన్నకి చిన్న దెబ్బలు అవ్వడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.
లాస్ ఏంజిల్స్ లో ఉంటె గొడవ జరుగుతుందని చెప్పగానే ఫ్యామిలీ ఫస్ట్ అని చెప్పి వచ్చాను. నిన్న గాయాలు పాలయిన రిపోర్టర్ మీద దాడి అనుకోకుండా జరిగింది. మీడియా వాళ్ళకి నాన్న దండం పెట్టుకుంటూనే ముందుకు వచ్చాడు. దెబ్బ జరిగిన మీడియా కుటుంబం తో నేను మాట్లాడాను.వాళ్ళకి అండగా ఉంటాను. రాచకొండ కమిషనర్ ని కూడా కలుస్తాను.మనోజ్ విషయంలో మా నాన్న చెప్పిందే చేశాను.ఆయన మాట వేద వాక్కు. ఆయన పర్మిషన్ ఉంటేనే ఇంట్లోకి రావాలని చెప్పుకొచ్చాడు.
Also Read