మోహన్ బాబు వల్లే నా జీవితం మారిపోయింది...
on Dec 11, 2024
శ్రీహరి(srihari)హీరోగా వచ్చిన 'సాంబయ్య 'సినిమాతో ప్రొడ్యూసర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన బెల్లంకొండ సురేష్(bellamkonda suresh)ఆ తర్వాత ఆది,చెన్నకేశవ రెడ్డి,లక్షి నరసింహ, రభస, కందిరీగ, నా ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్,మా అన్నయ్య, భలే దొంగలు,కాంచన, గంగ,శంభో శివ శంభో,అల్లుడు శ్రీను వంటి పలు హిట్ సినిమాలని ప్రొడ్యూస్ చేసి అగ్ర నిర్మాత అనే టాగ్ లైన్ ని పొందాడు.
లేటెస్ట్ గా ఆయనొక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నేను సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు మూల కారణం మోహన్ బాబు(mohan babu)ఆయన నాకు ఎంతో సాయం చేసారు.అందుకే దేవుడుతో సమానం, నా గురువు కూడా ఆయనే.ఆయన దగ్గర 'నా మొగుడు నాకు సొంతం, అల్లుడుగారు, అల్లరి మొగుడు ఇలా ఎన్నో సినిమాలకి మేనేజర్ గా చేశాను. నా భవిష్యత్తు కోసం ఆయన తన సినిమా షూటింగ్ ని కూడా ఆపిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
ఇక బెల్లంకొండ సురేష్ ఇద్దరి కొడుకులు సాయి శ్రీనివాస్(sai srinivas)సాయి గణేష్(sai ganesh)లు హీరోలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ని పొందారు.సాయి శ్రీనివాస్ ఐతే భారీ బడ్జెట్ హీరోగా కూడా గుర్తింపు పొందాడు. సాయి శ్రీనివాస్ మొదటి సినిమా అల్లుడు శ్రీనుని సురేష్ నే నిర్మించాడు.
Also Read