
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్ చూద్దాం
ఎప్పటికప్పుడు తెలుగు సినిమా న్యూస్ సరికొత్త క్రేజీ అప్ డేట్ తో మీ ముందు ఉంటున్నాయి. మరి ఈ క్రేజీ న్యూస్ ఏంటో చూసేద్దాం 1 . హెల్లాల్లల్లో సాంగ్ రికార్డ్స్ మొన్న 23 న భూపాల్ సాక్షిగా పెద్ది నుంచి 'హెల్లాల్లల్లో' సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. అలా విడుదలైందో లేదో రికార్డులే నా చిరునామా అంటూ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 18 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక ప్రాంతీయ సినిమా నుంచి వచ్చిన సాంగ్ హిందీ, సౌత్ భాషల యూట్యూబ్ ట్రెండింగ్స్ లో అగ్రస్థానంలో నిలవడం పెద్ది స్టామినా ఏ పాటిదో తెలియచేస్తుంది. 2 . కోకాపేటలో ప్రభాస్ డ్రీమ్ హౌస్.. ఎకరం ధర వింటే షాక్ అవ్వాల్సిందే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్ కోకాపేట ఏరియాలో తన సరికొత్త డ్రీమ్ హౌస్ నిర్మాణ పనులని అధికారికంగా ప్రారంభించారు. అంతర్జాతీయ ఆర్కిటెక్ట్స్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండగా భారీ హోమ్ థియేటర్, అత్యాధునిక జిమ్నేషియం, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్పోర్ట్స్ ఏరియాని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.రెండు ఎకరాల్లో నిర్మాణం జరుపుకోనుండగా ఎకరం భూమి విలువ దాదాపు 150 కోట్లకి పైగా ఉంది. అంటే కేవలం ఆయన కొనుగోలు చేసిన ఈ రెండు ఎకరాల ఖాళీ స్థలం విలువే 300 కోట్లు. ప్రభాస్ డ్రీమ్ మ్యాన్షన్ గా నిర్మాణం జరుపుకోనుంది 3 . బండ్ల గణేష్‌ని చెప్పుతో కొట్టిన టాలీవుడ్ ప్రముఖుడు.. ఫ్యాన్స్ షాక్ బండ్ల గణేష్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు స్టార్ హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రోజే నా జీవితంలో చేదు సంఘటన జరిగింది. షూటింగ్ స్పాట్లో ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ పెద్దమనిషి పక్కన కూర్చున్నాను. నేను “సార్' అని పిలవగానే సదరు పెద్ద మనిషి చెప్పు తీసుకుని నన్ను కొట్టాడు. అయితే ఆ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది. నా దగ్గర డబ్బు లేదు. నేను బలహీనుడిని కాబట్టే నన్ను అలా అవమానించారనిపించింది. బయటకు వచ్చిన తర్వాత నాతో ఉన్న వ్యక్తితో ఒక మాట చెప్పాను. ఒక రోజు ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తా.. లేదంటే నా పేరు గణేష్ కాదు అని. గణేష్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 4 . పెద్ది వివాదంపై రంగంలోకి చిరంజీవి పెద్ది' నుంచే మాకు పర్సెంటేజ్(రెవెన్యూ షేరింగ్) సిస్టంని అందుబాటులోకి తీసుకురావాల్సిందే, లేదంటే ఆ తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోరని తెలంగాణ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీర్మానించిన విషయం తెలిసిందే. దీంతో మరో వారం రోజుల్లో పెద్ది రిలీజ్ ఉండటంతో ఫ్యాన్స్ సినీ ప్రేమికుల్లో టెన్షన్ మొదలయ్యింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సమస్యని పరిష్కరించడానికి స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈ రోజు సాయంత్రం చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్స్ తో సమావేశం జరగనుంది. 5 .వారణాసి క్రేజీ అప్ డేట్.. ఫ్యాన్స్ కాలర్ ఎత్తాల్సిందే మహేష్ బాబు, రాజమౌళిల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం "వారణాసి" (Varanasi). ఈ గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జూన్ రెండో వారం నుంచి మూవీకి అత్యంత కీలకమైన సుదీర్ఘ యాక్షన్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కంటిన్యూగా నెల రోజుల పాటు జరగనున్నట్టుగా సమాచారం 6 .పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి నిరాశ తప్పదా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'పంజా' ని రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశకి గురవుతున్నారు. 'పంజా' లో పవన్ లుక్స్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దాంతో చాలా మంది పవన్ అభిమానులు 'బద్రి' నే రీ రిలీజ్ చెయ్యాలని అభిప్రాయపడుతున్నారు. 7 . రోబోలు వచ్చే కాలంలో పిల్లలెందుకు.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్ వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ వంటి టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో మానవ సంబంధాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. కళ్లముందే కలియుగం కనిపించడంతో పాటు భవిష్యత్తు కాలం చాలా భయంకరంగా మారబోతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితులున్న సమాజంలోకి కేవలం మన స్వార్థం, సంతోషం కోసం పిల్లలని తీసుకురావడం కరెక్ట్ కాదని ఆయన చెప్పుకొచ్చాడు. 8 .పెద్దిపై పోసాని షాకింగ్ కామెంట్స్ పోసాని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ది’ రిలీజ్ కి అటుఇటుగా నా కొత్త సినిమా 'ఆపరేషన్ అరుణా రెడ్డి' రిలీజ్ కానుంది. అయితే చరణ్ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. 9 .ఫ్లాప్ హీరోలకి కూడా వందల కోట్లు బడ్జెట్ అంటున్న తమ్మారెడ్డి పరిశ్రమలో ఎప్పుడైనా సరే కేవలం ఐదు శాతం సినిమాలు మాత్రమే లాభాలను తెచ్చిపెడతాయని, మిగిలిన తొంభై ఐదు శాతం చిత్రాలు నష్టాలనే మిగులుస్తాయని ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెబుతున్నారు. ముఖ్యంగా హీరోల పారితోషికాల విషయంలో నిర్మాతల వైఖరి మారాలి. వరుస ఫ్లాపులు ఇస్తున్న హీరోలకి సైతం వందల కోట్ల బడ్జెట్ కేటాయించి, భారీగా రెమ్యునరేషన్లు ఇస్తున్న నిర్మాతలు నేడు ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పుకొచ్చాడు 10 .శ్రీను వైట్ల, శర్వానంద్ తో విశ్వంభర భామ! దర్శకుడు శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబోలో ఒక మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ ని ఫిక్స్ చేసినట్లుగా సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న తాజా న్యూస్ . ఈ సంక్రాంతికి రవితేజతో కలిసి భర్త మహాశయులకు విజ్ఞప్తితో మెప్పించిన ఆషికా,మెగా స్టార్ విశ్వంభరలో కనువిందుచేయనున్న విషయం తెలిసిందే.
May 25, 2026 2:58PM
Varanasi: 'వారణాసి' నుండి క్రేజీ అప్డేట్.. మహేష్ కోసం జక్కన్న భారీ ప్లాన్!
సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ ఫిల్మ్ 'వారణాసి' (Varanasi) గురించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ హల్చల్ చేస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి జూన్ రెండో వారం నుండి అత్యంత కీలకమైన, సుదీర్ఘమైన యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ కొత్త షెడ్యూల్లో మహేష్ బాబుపై అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసమే సుమారు నెలకు పైగా నాన్-స్టాప్ షూటింగ్ సాగనుండటం విశేషం. ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే శ్రీరాముడిగానూ కనువిందు చేయనున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పవర్ ఫుల్ నెగటివ్ రోల్ చేస్తుండగా, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో 'మందాకిని' అనే కీలక పాత్రలో నటిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7, 2027న థియేటర్లలోకి తీసుకురానున్నారు మేకర్స్. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా జెండాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసిన రాజమౌళి, ఈసారి మహేష్ బాబుతో కలిసి సరికొత్త గ్లోబల్ వండర్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
May 25, 2026 10:51AM
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్..
1. ఒకే ఫ్రేమ్‌లో 'మెగా బ్రదర్స్'.. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబి కాంబినేషన్లో తెరకెక్కబోయే ప్రతిష్టాత్మక చిత్రం 'మెగా 158 ' పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ మూవీ లాంచ్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చాలాకాలం తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు.. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒకే వేదికపై, ఒకే ఫ్రేమ్‌లో నవ్వుతూ కనిపించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ అపురూప దృశ్యానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 2. 'దృశ్యం 3' మూవీ రివ్యూ! ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన క్రేజీ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'దృశ్యం 3' థియేటర్లలోకి వచ్చి డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. డైరెక్టర్ అక్కడక్కడా కొన్ని టెన్షన్ సీన్స్‌తో సినిమా మూడ్‌ను బిల్డ్ చేయడంలో సక్సెస్ అయినప్పటికీ.. ఓవరాల్‌గా కథనం ఫ్లాట్‌గా, చాలా సాధారణంగా సాగిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. క్లైమాక్స్ సీక్వెన్స్ కొంతవరకు పర్వాలేదనిపించినా.. మిగతా సినిమా అంతా సాగతీతగా, రొటీన్‌గా అనిపిస్తుందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. 3. చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్! ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్' సరికొత్త రికార్డులతో యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రీసెంట్గా రిలీజైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ యూట్యూబ్ లో విడుదలైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్, లైక్స్‌తో సరికొత్త రికార్డులను సృష్టించింది. 64 మిలియన్లకు పైగా వ్యూస్ తో.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన గ్లింప్స్ గా 'డ్రాగన్' నిలిచింది. 4. 'స్పిరిట్' క్రేజీ అప్డేట్! ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'స్పిరిట్' సరికొత్త షెడ్యూల్ మే 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రేజీ షెడ్యూల్లో హీరో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి కూడా జాయిన్ కాబోతున్నారు. ఈ షెడ్యూల్లోనే ప్రభాస్, త్రిప్తి డిమ్రి కాంబినేషన్లో వచ్చే కొన్ని కీలకమైన సీన్స్‌ను మేకర్స్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. 5. 'ఉప్పెన' కంటే 100 రెట్లు షాకింగ్ ట్విస్ట్! రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' జూన్ 4న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ చరణ్ సినిమాపై ఒక సంచలన లీక్ ఇచ్చారు. ఈ చిత్రంలోని "ఢిల్లీ ఎపిసోడ్" తనకు అత్యంత ఇష్టమైన భాగమని, అక్కడే కథను మలుపు తిప్పే అతిపెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుందని చరణ్ పేర్కొన్నారు. అంతేకాదు, బుచ్చిబాబు మొదటి సినిమా 'ఉప్పెన' క్లైమాక్స్ ట్విస్ట్ కంటే ఈ ట్విస్ట్ 100 రెట్లు ఎక్కువ షాకింగ్‌గా, ఊహకందని విధంగా ఉంటుందని చరణ్ చెప్పారు. 6. 'వారణాసి' సాంగ్ కోసం స్పెషల్ సెట్! మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో గ్లోబల్ రేంజ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' సరికొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కాటేదాన్ (Katedan) ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ సాంగ్ షూటింగ్ నడుస్తోంది. మహేష్ బాబుపై చిత్రీకరిస్తున్న ఈ క్రేజీ సాంగ్ కోసం మేకర్స్ అక్కడ ఒక ప్రత్యేకమైన సెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. 7. రియల్ హీరో అనిపించుకున్న రామ్ పోతినేని! ఎలాంటి హంగు ఆర్భాటాలు, మీడియా హడావుడి లేకుండా రామ్ పోతినేని నేరుగా ఓ వీరాభిమాని ఇంటికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. గత 18 ఏళ్లుగా 'ఫ్రెడ్రిచ్ అటాక్సియా' అనే అరుదైన నరాల బలహీనత వ్యాధితో పోరాడుతున్న ఓ యువతి.. తనను ఒక్కసారైనా చూడాలని కోరుకుంటున్న విషయం తెలిసి రామ్ వెంటనే స్పందించారు. ఎలాంటి ప్రచారం ఆశించకుండా ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి, ఆమె పక్కనే కూర్చుని ఆప్యాయంగా పలకరించి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. 8. అప్పుడే ఓటీటీలోకి 'వీరభద్రుడు' రీసెంట్గా రిలీజై బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న సూర్య లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ 'వీరభద్రుడు' అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 'నెట్‌ఫ్లిక్స్' భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రేజీ డీల్ కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాదాపు రూ. 35 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఉండే నాలుగు వారాల విండో రూల్ ప్రకారం ఈ చిత్రం జూన్ రెండో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. 9. 'కుర్చీ తాత' కన్నుమూత! ‘కుర్చీ మడతపెట్టి’ అనే ఒకే ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగిన 'కుర్చీ తాత' అలియాస్ మహ్మద్ పాషా కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్కులో వాకింగ్ చేస్తుండగా ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. తీవ్ర వడదెబ్బ కారణంగా ఆయన కన్నుమూసినట్లు సమాచారం. 10. SRH ఓనర్ తో అనిరుధ్ పెళ్లి? స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సన్ గ్రూప్ వారసురాలు కావ్య మారన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్ మీడియాలో మళ్ళీ వార్తలొస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ రూమర్స్‌పై అనిరుధ్ స్పందిస్తూ.. ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి ఈ వార్తలు ట్రెండ్ అవుతుండటం ఆసక్తికరంగా మారింది.
May 21, 2026 3:21PM.webp)
పర్శంటేజ్ సిస్టం నుంచి మినహాయింపు కోరిన 17 సినిమాలు
అందరం పుట్టింది.. బతుకుతుంది.. ఎదుగుతుంది తెలుగు సినిమా వలనే అనే విషయం తెలిసి కూడా కొన్ని రోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ మధ్య పర్శంటేజ్ విషయంలో ఇష్యూ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎవరి వర్షన్ వాళ్ళది. విచిత్రం ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నా కూడా కరెక్టే కదా వాళ్ళు మాట్లాడేది అనిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే వివాదం మరింత ముదరడంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రంగంలోకి దిగింది. ఇరు వర్గాల మధ్య సమన్వయం కుదర్చడానికి, సమస్యకి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి పదిహేను మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రెండు నెలల్లో పూర్తి నివేదిక ఇవ్వనుంది. ఈ మొత్తం వివాదంలో మరో ఆసక్తికరమైన కీలకమైన మలుపు చోటుచేసుకుంది. పర్సంటేజ్ సిస్టమ్ వివాదం ఎలా ఉన్నప్పటికీ, ఇప్పటికే భారీ అంచనాలతో, వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సుమారు పదిహేడు క్రేజీ ప్రాజెక్టులకి ఈ వివాదం నుండి ఊరట లభించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ 17 సినిమాల జాబితాలో పెద్ది, డ్రాగన్ , విశ్వంభర, హనుమన్ 2 , కల్కి 2', స్పిరిట్', వారణాసి, ది ప్యారడైజ్, రాకా, ఎన్ బి కె 111 , మెగా 158 ,రామ్ చరణ్, సుకుమార్ కాంబో మూవీ, ఏ కె 47 ,నాని, సుజిత్ కాంబో, వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో, అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మూవీ ఇలా సుమారు 17 చిత్రాలకి పర్శంటేజ్ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. Also read: Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్ బిల్లు వైరల్.. వాటర్ బాటిల్ రేటు చూస్తే షాకవుతారు ఈ పెద్ద సినిమాల థియేట్రికల్ బిజినెస్ మరియు అడ్వాన్స్‌లు ఇప్పటికే పాత పద్ధతిలోనే జరిగాయని, కాబట్టి వీటిని ప్రస్తుత వివాదం నుండి పక్కన పెట్టాలని ఇరు వర్గాలు ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఈ మినహాయింపు జాబితా వల్ల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల విడుదలకి ఎలాంటి ఆటంకం కలగదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా థియేటర్ల మనుగడ ముఖ్యం, అలాగే నిర్మాతల పెట్టుబడి సేఫ్ అవ్వడం కూడా అంతే ముఖ్యం. ఈ ఫ్యామిలీ సమస్యని టాలీవుడ్ పెద్దలు త్వరలోనే సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తారని ప్రేక్షకులు మరియు సినిమా ప్రేమికులు ఆశిస్తున్నారు.
May 16, 2026 11:57AM
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్
తగ్గేదేలే అనే రీతిలో పలు ఆసక్తికర తెలుగు సినిమా వార్తలు తెలుగు సినిమా ప్రేమికులు, పాఠకుల కోసం అందుబాటులో ఉన్నాయి. 1 . నాగార్జున విషయంలో హైకోర్ట్ కీలక తీర్పు.. అనుమతి పత్రాలు చూపండి అని ఆదేశాలు నా పేరుతో టీ షర్ట్స్ ని ఒక సంస్థ విక్రయిస్తుందని కొన్ని రోజుల క్రితం నాగార్జున ఢిల్లీ హై కోర్ట్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు స్పందిస్తు నాగార్జునతో నేరుగా ఒప్పందం లేనప్పుడు ఆయన పేరు, ఫోటోలని వాడుకుంటూ టీ షర్టులు ఎలా అమ్ముతారు. మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా హక్కులు పొందామని చెప్తే సరిపోతుందా! ప్లెయింటిఫ్ తో మీకు పరిచయం కూడా లేనప్పుడు ఆ వస్తువులని అమ్మే చట్టబద్ధత మీకు ఎక్కడి నుంచి వచ్చింది. అనుమతి పాత్రలు ఉన్నాయా అని ఢిల్లీ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 2. విజయ్ ఇక సెకండ్ ప్లేస్ లోనే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, రాజకీయాల్లో తనకంటు ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్న దళపతి విజయ్ మరో అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు. ప్రముఖ సినిమా వెబ్ సైట్ ఐఎండీబీ తాజాగా విడుదల చేసిన 'పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్' జాబితాలో విజయ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అంతకు ముందు వారంలో 21 వ స్థానంలో ఉన్న విజయ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి రావడం విశేషం. 3 . భోపాల్‌లో ‘పెద్ది’ సౌండ్.. థర్డ్ సాంగ్ లాంచ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో పెద్ది నుంచి తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ కి సంబంధించిన శుభవార్త బయటకు వచ్చింది. 'సౌండ్ ఆఫ్ పెద్ది' పేరుతో మే 23వ తేదీన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో స్పెషల్ సాంగ్‌ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్లో రెహమాన్ స్వయంగా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. ఆయన స్వరపరిచిన బాణీలకి స్టేజ్ పై లైవ్ మ్యూజిక్ తోడైతే, ఆ వైబ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ ఒక రేంజ్ లో సక్సెస్ అయిన విషయం తెలిసిందే. 4 . బాలకృష్ణ, ఎన్టీఆర్ మల్టీస్టారర్! గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మల్టిస్టారర్ చెయ్యాలి అనే డిమాండ్ ఎప్పట్నుంచో ఫ్యాన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా మళ్ళీ తమ కోరికని వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ కోరికని బాలయ్య, ఎన్టీఆర్ తీరుస్తారేమో చూడాలి. బాలయ్య ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చిత్రంతో బిజీగా ఉండగా, ప్రశాంత్ నీల్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. 5 . IBOMMA మళ్లీ వచ్చేసింది! కొంతకాలంగా నిలిచిపోయినట్లు కనిపించిన IBOMMA వెబ్సైట్ తాజాగా మళ్లీ ఆన్లైన్లో కనిపించడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. సైట్ ని ఆపరేట్ చేస్తున్నాడనే ఆరోపణలతో రవిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేయగా.. సైట్ కూడా క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు మళ్లీ కొత్త సినిమాలతో సైట్ యాక్టివ్ కావడం ఇండస్ట్రీకి పెద్ద షాక్‌గా మారింది. ఈ పరిణామంపై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రవి ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న విషయం తెలిసిందే. 6 . మెగాస్టార్ చిరంజీవి జెన్ జీ లుక్ వైరల్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎంతో స్లిమ్‌గా, స్టైలిష్‌గా జెన్ జీ లుక్ లో యువ హీరోలకి సైతం పోటీ ఇచ్చేలా ఉన్నారు. దీంతో సదరు స్టిల్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. గత కొంతకాలంగా చిరు కఠినమైన డైట్ క్రమశిక్షణతో కూడిన వర్కవుట్స్ చేస్తున్నారు. అందుకే అంత ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారని సినీ వర్గాల టాక్. 7 . క్షమాపణలు చెప్తున్న అలీ హిందువులని అవమానించే రీతిలో ఉన్న సోప్ యాడ్ చేసి ప్రముఖ నటుడు అలీ అపఖ్యాతికి గురైన విషయం తెలిసిందే. హిందువులు సోషల్ మీడియా వేదికగా అలీపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. గతంలో తాను నటించిన 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలోని ఒక పాపులర్ కామెడీ సీన్‌ని స్ఫూర్తిగా తీసుకుని ముంబైకి చెందిన కంపెనీ ఈ యాడ్ రూపొందించింది దాంతో కేవలం వినోదం కోసమే ఆ యాడ్ చేశాను. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదు. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరాడు. 8 . పూజాహెగ్డే కి అండగా అల్లు అర్జున్! పూజాహెగ్డే ఇటీవల కెరీర్ పరంగా కొంచం డల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంలో తనకి అవకాశం ఇవ్వబోతున్నాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అట్లీ మూవీతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. పూజా, అల్లు అర్జున్ కాంబోలో ఇప్పటికే డి జె జగన్నాధం, అల వైకుంఠ పురం వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి. 9 . వారణాసిలో వారణాసి’ షూటింగ్? మహేశ్‌బాబు రాజమౌళి ల ‘వారణాసి’షూటింగ్ ఇప్పుడు అసలు లెవల్‌కి వెళ్లబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. భారీ అండర్‌వాటర్ యాక్షన్ సీన్‌ని వారణాసిలో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మొదట ఈ సన్నివేశాన్ని హైదరాబాద్‌లో షూట్ చేయాలని అనుకున్నారు. కానీ 150 ట్యాంకర్ల నీటి సరఫరాకి జలమండలి అనుమతి ఇవ్వకపోవడంతో వారణాసికి షిఫ్ట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి . 10 . నట్టి కుమార్ రాజీనామా ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేయడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు తాను పంపిన రాజీనామా లేఖలో 'ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పారదర్శకత లోపించింది. కొందరు సభ్యుల ఏకపక్ష నిర్ణయాల వల్ల చిన్న నిర్మాతలకి అన్యాయం జరుగుతుంది. థియేటర్ల కేటాయింపు, వర్చువల్ ప్రింట్ ఫీజు వంటి విషయాల్లో కౌన్సిల్ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైంది. కేవలం కొందరి ప్రయోజనాల కోసమే కౌన్సిల్ కార్యకలాపాలు సాగుతున్నాయి. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
May 13, 2026 3:22PM
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్..
'వారణాసి' షూటింగ్.. ఆ సమస్యకు పరిష్కారం దొరికిందా? మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'వారణాసి' సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాల్గొంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో నీటి కొరత కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడిందన్న వార్తలు వైరల్ అయ్యాయి. భారీ వాటర్ అవసరాల నేపథ్యంలో సమస్య తలెత్తినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వడంతో ఆ సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా ప్లాన్ మార్చారా? అన్న చర్చ సాగుతోంది. ముంబైలో పెద్ది హంగామా! పెద్ది ట్రైలర్‌ను ఈ నెల 18న ముంబైలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు మూవీ టీమ్ మొత్తం ఈ ఈవెంట్లో పాల్గొననుంది. ట్రైలర్ లాంచ్ తర్వాత భోపాల్‌లో స్పెషల్ మ్యూజికల్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది. ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్ టైమ్ ఫిక్స్! ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'డ్రాగన్' నుండి సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మే 20న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు టైం కూడా ఫిక్స్ అయింది. మే 19 అర్థరాత్రి 12 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చిరంజీవి! మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో రానున్న క్రేజీ ప్రాజెక్ట్ 'Mega158' గురించి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం మెగాస్టార్ సరికొత్త మేకోవర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో.. రగ్గడ్ గా కనిపించబోతున్నారని సమాచారం. విభిన్నమైన హెయిర్ స్టైల్, గడ్డంతో చిరు వింటేజ్ మాస్ లుక్‌ను తలపించేలా ఈ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు టాక్. డైరెక్టర్ గా మారుతున్న రామ్ పోతినేని! టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడిగా మారబోతున్నాడు. వరుస పరాజయాల నేపథ్యంలో, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి రామ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, తన అన్న కృష్ణ చైతన్యతో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. రవితేజ రెమ్యూనరేషన్లో భారీ కోత! తనపై నమ్మకం ఉంచిన నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ. 25 నుండి 30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న రవితేజ.. తన రాబోయే చిత్రాల కోసం దానిని రూ. 15 కోట్లకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. తన మార్కెట్ మళ్ళీ నిలదొక్కుకునే వరకు బడ్జెట్ నియంత్రణలో ఉండాలని, తద్వారా సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట. విజయ్ సీఎం కావడంపై రజినీకాంత్ రియాక్షన్! తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ కు.. సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడ్డారు. ఈ సందర్భంగా విలేకరులు విజయ్ సీఎం కావడంపై ఆయన అభిప్రాయాన్ని కోరారు. రజినీకాంత్ ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా, కేవలం తనదైన శైలిలో నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రజినీకాంత్ మౌనంగా ఉన్నప్పటికీ.. ఆ చిరునవ్వులో విజయ్ పట్ల గౌరవం, అభినందనలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సూర్య సినిమాకు కొత్త తలనొప్పి! కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ ఇప్పుడు తెలుగు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. సూర్య హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'వీర భద్రుడు' సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో.. బాలాజీ గతంలో తెలుగు సినిమాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో.. తెలుగు సినిమాల్లో లాజిక్ ఉండదని, కేవలం హీరోల ఎలివేషన్లకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన విమర్శించారు. విడాకుల బాటలో మౌనీ రాయ్ బాలీవుడ్ నటి, 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ తన భర్త, దుబాయ్ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట గత కొద్ది రోజులుగా విడివిడిగా నివసిస్తున్నారని, వీరి మధ్య మనస్పర్థలు తీవ్రమయ్యాయని తెలుస్తోంది. మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. మౌనీ తన ప్రొఫైల్ నుండి భర్తతో ఉన్న కొన్ని ఫోటోలను తొలగించగా, సూరజ్ కూడా తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేసినట్లు సమాచారం. ప్రముఖ సింగర్ కు జైలు శిక్ష ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టు తీర్పు వెలువడింది. గత మార్చిలో కాలిఫోర్నియాలో మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన బ్రిట్నీపై నమోదైన కేసులో, తాజాగా ఆమెకు ఒక్కరోజు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జైలు శిక్షతో పాటు 571 డాలర్ల జరిమానాను కోర్టు విధించింది.
May 12, 2026 4:10PM
Varanasi: ఇక నో హాలిడేస్.. రాజమౌళి బ్రాండ్ షురూ
మహేష్(Mahesh Babu)రాజమౌళి(ss Rajamouli)కలల ప్రాజెక్ట్ వారణాసి(Varanasi). భారతీయ చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు భారతీయ సినీ ప్రేక్షకుల కలల ప్రాజెక్ట్ కూడా. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల ఆధారంగా, ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథగా రూపొందుతుందనే టాక్ ఉంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందని, వారణాసి నుంచి మొదలై కెన్యా, అంటార్కిటికా వంటి వివిధ ప్రాంతాలకి కథ విస్తరిస్తుందనే మరో టాక్ కూడా వినిపిస్తూ ఉంది వేసవి కాలం కావడంతో మండుతున్న ఎండల దృష్ట్యా వారణాసికి చిత్ర యూనిట్ కొన్ని రోజుల క్రితం స్మాల్ బ్రేక్ ఇచ్చింది. ఇప్పడు తిరిగి కొత్త షెడ్యూల్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ కొత్త షెడ్యూల్లో మహేష్, ప్రియాంక చోప్రా(Priyanka Chopra)ఇతర ప్రధాన తారాగణంపై కొన్ని కీలకమైన సన్నివేశాలని తెరకెక్కించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే భారీ సెట్లని రూపొందించినట్టు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం అంతర్జాతీయ లొకేషన్లకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. Also read: వీరభద్రుడు ట్రైలర్ అదుర్స్.. తెల్ల వాళ్ళ దేవుడైతే క్షమాపణ అడగవచ్చు ఇటీవల మెక్సికోలో జరిగిన ఓ అంతర్జాతీయ ఈవెంట్లో ‘వారణాసి’ని చిత్ర బృందం పరిచయం చేసింది. ప్రెజెంట్ షెడ్యూల్ పూర్తవ్వగానే ఫ్రాన్స్‌లో కూడా భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం. గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ జానర్లో తెరకెక్కుతున్న వారణాసిని హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా కె ఎల్ నారాయణ, ఎస్ ఎస్ కార్తికేయ సుమారు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
May 12, 2026 10:45AM
Manasa Varanasi vs Mamitha bhaiju: ఎంత పని జరిగిపోయింది.. ఒకరి ప్లేస్ లో మరొకరు!
ఒకరి అవకాశాలని ఒకరు అందిపుచ్చుకోవడం అనేది సినీ ఇండస్ట్రీలో కామన్. ప్రెజెంట్ క్రేజ్ ని బట్టి మేకర్స్ తమ సినిమాలో పలానా వాళ్ళు ఉంటే తమ సినిమాకి ఉపయోగమని కోరుకోవడమే అందుకు కారణం. అంతే కానీ సినిమా కథలగా పగలు, కుట్ర కుతంత్రాలు ఉండవు. ఈ కోవలోనే ప్రేమలు, డ్రాగన్ బ్యూటి మమిత భైజు(Mamitha bhaiju)ప్లేస్ లో కపుల్ ఫ్రెండ్లీ ఫేమ్ మానస వారణాసి(Manasa Varanasi)వచ్చి చేరిందనే న్యూస్ వైరల్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. శర్వానంద్, శ్రీనువైట్ల(Srinu Vaitla) కాంబోలో ‘జార్జ్ క్రిష్’అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రెస్టేజియస్ట్ గా రూపొందిస్తుంది. తొలుత హీరోయిన్ గా మమితా బైజుని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అధికార ప్రకటన రావడమే తరువాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు మానస వారణాసిని ఫైనల్ చేసే ఆలోచనలో టీమ్ ఉందని తెలుస్తోంది.. కపుల్ ఫ్రెండ్లీ లో మిత్రా క్యారక్టర్ ని అత్యద్భుతంగా పోషించింది. ప్రభాస్ సైతం మానస పెర్ఫార్మ్ ని మెచ్చుకున్నాడు. మరి ఈ వార్త నిజం అయితే మానస వారణాసికి మంచి అవకాశమని చెప్పవచ్చు మరోవైపు శర్వానంద్ ఇప్పటికే తన లుక్ పై కసరత్తులు చేస్తున్నాడు. బైకర్ కోసం సన్నబడ్డ శర్వా జార్జ్ క్రిష్ కోసం కొంచెం వెయిట్ పెరగబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. శ్రీను వైట్ల గత చిత్రం ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన సత్తా చాటాలనే పట్టుదలతో శ్రీను వైట్ల ఉన్నాడు.
May 11, 2026 9:17AM
Rajamouli: రాజమౌళి నెక్స్ట్ టార్గెట్.. మహేష్ తర్వాత మళ్ళీ 'ఆర్ఆర్ఆర్' హీరోలతోనేనా?
- 'వారణాసి' తర్వాత రాజమౌళి మూవీ ఏ హీరోతో? - ఎన్టీఆర్, రామ్ చరణ్ వైపే జక్కన్న మొగ్గు చూపుతున్నాడా? - మరో మల్టీస్టారర్ చేసే సాహసం చేస్తాడా? - ఆ రెండు స్టోరీలతో దర్శకధీరుడు వేస్తున్న స్కెచ్ ఏంటి? దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ప్రస్తుతం మహేష్ బాబుతో 'వారణాసి' (Varanasi) సినిమా చేస్తున్నారు. ఈ భారీ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుంది అనే చర్చ మొదలైపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'వారణాసి' సినిమా తర్వాత రాజమౌళి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం 'ఆర్ఆర్ఆర్'తో ఈ ఇద్దరు హీరోలకు గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. అలాగే, రాజమౌళితో వారికున్న బాండింగ్ కూడా చాలా ప్రత్యేకమైనది. రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ కోసం విడివిడిగా రెండు పవర్ఫుల్ కథలను సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఏ కథ ముందుగా కొలిక్కి వస్తే.. ఆ హీరోతో సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. గతంలో వీరిద్దరితో కలిసి మల్టీస్టారర్ చేసిన రాజమౌళి.. ఈసారి మాత్రం విడివిడిగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ కోసం ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఒక హై-వోల్టేజ్ ఎమోషనల్ డ్రామాను సిద్ధం చేస్తున్నట్లు టాక్. అలాగే రామ్ చరణ్ స్టైలిష్ లుక్, యాక్షన్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని మరో భారీ కథపై కసరత్తు జరుగుతోందట. ఈ ఇద్దరు హీరోలలో ఎవరితో ముందుగా సినిమా సెట్స్ పైకి వెళ్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బహుశా రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి ఈ రెండు స్క్రిప్టులపై సమాంతరంగా చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతానికి రాజమౌళి పూర్తి దృష్టి మహేష్ బాబు సినిమాపైనే ఉంది. 'వారణాసి' మూవీ ఇండియన్ సినిమాలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇది పూర్తి కాగానే తన తదుపరి హీరో ఎవరనే దానిపై జక్కన్న అధికారికంగా స్పందించే అవకాశం ఉంది.
May 9, 2026 10:57AM
Varanasi: వారణాసి@199 రూపాయలు
మహేష్ బాబు(Mahesh Babu),రాజమౌళి(Ss Rajamouli)ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ వారణాసి(Varanasi)ఇప్పుడు సరికొత్త ఫీచర్ ని ఇండియన్ చిత్ర సీమకి పరిచయం చేస్తుంది. ఇండియాలోనే ఇది ఫస్ట్ టైం. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వారణాసి ట్రెండింగ్ లో కొనసాగుతుంది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సాధారణంగా సినిమాలకు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో ఉచితంగా వస్తుంటాయి. కానీ, రాజమౌళి ఈసారి విభిన్నంగా ఆలోచిస్తున్నారు. సినిమా మేకింగ్ వీడియోలు, బిహైండ్ ద సీన్స్, నటీనటుల ఇంటర్వ్యూలు మరియు ఎక్స్‌క్లూజివ్ ఫోటోలను నేరుగా అభిమానులకు అందించేందుకు ఒక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనికి 'వారణాసి' అనే కోడ్ నేమ్ పెట్టినట్లు తెలుస్తోంది. అంటే వారణాసిని తెరకెక్కించడం వెనక ఉన్న కష్టాన్ని, ఆసక్తికరమైన బి టి ఎస్ వీడియోస్ చూడాలని అనుకునే వాళ్ళు 199 రూపాయలు చెల్లించి వారణాసిని సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలి. ఈ ప్యాకేజీ లో వారణాసికి సంబంధించి మహేష్,ప్రియాంకకి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ ఫొటోలతో పాటు మిగతా ఆర్టిసుల డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే వారణాసి వివరాలన్నీ మీ పాకెట్ లో ఉండబోతున్నాయి. గతంలో కొన్ని హాలీవుడ్ చిత్రాలకి అనుసరించే ఈ విధానాన్ని ఇండియాలో రాజమౌళి ప్రవేశపెడుతుండటం విశేషం. Also read: Santhosh Nair: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి.. భార్య పరిస్థితి విషమం రాజమౌళి ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ గుర్తింపు పొందిన నేపథ్యంలో మహేష్ బాబు సినిమాతో ఇండియన్ సినిమా మార్కెట్ పరిధిని మరింత పెంచాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రవేశపెడుతున్న ఈ వినూత్న ప్రమోషనల్ స్ట్రాటజీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఒకవేళ ఇది క్లిక్ అయితే, భవిష్యత్తులో మిగిలిన పెద్ద సినిమాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.
May 5, 2026 4:20PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com







