
రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు పక్కా.. చిరంజీవి బర్త్ డేకి నేను బ్లడ్ ఇచ్చాను!
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా ‘పెద్ది’ (Peddi). ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బెంగళూరులో జరిగిన ‘పెద్ది’ ప్రెస్ మీట్ ఈవెంట్లో పాల్గొన్న శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar).. రామ్‌చరణ్ డెడికేషన్, మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో రామ్‌చరణ్ జర్నీని తాను మొదటి సినిమా నుంచి గమనిస్తున్నానని శివ రాజ్‌కుమార్ ఈవెంట్లో పేర్కొన్నారు. చరణ్ ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం ఆయన పడిన కష్టం, చూపిస్తున్న సిన్సియారిటీయేనని కొనియాడారు. చరణ్ వెనుక తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు బాబాయ్ పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. ఒక సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్ పక్కపక్కనే కూర్చున్నప్పుడు వారి మధ్య కనిపించిన ఆ అప్యాయత, అనుబంధం తన హృదయాన్ని ఎంతగానో తాకిందని.. తన తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్‌ను తాను ఎలా చూసుకునేవాడినో, చరణ్‌ను పవన్ కళ్యాణ్ అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తారని ఎమోషనల్ అయ్యారు. ‘పెద్ది’ సినిమాలో రామ్‌చరణ్ నటన నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని శివరాజ్‌కుమార్ చెప్పారు. ఈ చిత్రంలో చరణ్ కనబరిచిన అద్భుతమైన పర్ఫార్మెన్స్కు కచ్చితంగా నేషనల్ అవార్డ్ రావాలనేది తన బలమైన కోరిక అని శివన్న ఆకాంక్షించారు. ఈ సినిమాలో చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, హోల్ యూనిట్ అందించిన లవ్ అండ్ అఫెక్షన్‌ను తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో ఉన్న ప్రత్యేక బాండింగ్ గురించి చెప్తూ.. గతంలో చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్‌కు తాను స్వయంగా వెళ్లి రక్తం ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. మెగా ఫ్యామిలీపై అభిమానులు చూపిస్తున్న ఈ అప్యాయత ఇలాగే కొనసాగాలని ఆశించారు. కర్ణాటక ప్రజలకు భాషా భేదాలు ఉండవని, మంచి సినిమాను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారని చెప్తూ, ‘పెద్ది’ సినిమాలో అవకాశం రాగానే తాను ఎంతో ఎగ్జైట్ అయి చరణ్‌కు ఫోన్ చేశానని, ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పారు. ఈ సినిమా కేవలం స్పోర్ట్స్ మాత్రమే కాదు.. మనిషికి, ఆటకు మధ్య ఉండే ఒక బలమైన ఎమోషన్ అని శివరాజ్‌కుమార్ విశ్లేషించారు. మనం ఎందుకు ఆడుతున్నాం, దేనికోసం బ్రతుకుతున్నాం అనే పాయింట్‌ను దర్శకుడు బుచ్చిబాబు ప్రతి ఒక్కరి హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించారని ప్రశంసించారు. 'పెద్ది' పాత్ర థియేటర్ల నుంచి బయటకు వచ్చినా అందరి గుండెల్లో నిలిచిపోతుందని, జూన్ 4న విడుదల కాబోతున్న ఈ అద్భుతమైన సినిమా కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు శివ రాజ్‌కుమార్ తెలిపారు.
May 25, 2026 7:02PMరామ్‌చరణ్ పర్సనల్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.. కానీ, నమ్మాల్సిందే!
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ క్రేజ్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఉంది. 'ఆర్ఆర్ఆర్' సినిమా అందించిన తిరుగులేని విజయంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన చరణ్, తన సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా చరణ్ పక్కన కొండలా నిలబడే ఆయన పర్సనల్ బాడీగార్డ్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ముంబైలో జరిగిన 'పెద్ది' చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకకు రామ్‌చరణ్ హాజరయ్యారు. ఈ ఈవెంట్లో చరణ్ లుక్‌తో పాటు ఆయనకు నీడలా నడుస్తూ రక్షణ కల్పించిన ఒక విదేశీ బాడీగార్డ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఈవెంట్ ముగిసే వరకు చరణ్‌ను కంటికి రెప్పలా కాపాడిన ఆ భారీ కాయుడి పేరు కెవిన్ కుంటా. ఆయన సాధారణ సెక్యూరిటీ గార్డ్ కాదని, అంతర్జాతీయంగా పేరుపొందిన ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్ అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్ కుంటా, ప్రస్తుతం ఇటలీలో స్థిరపడ్డారు. అక్కడ నేషనల్ మిడిల్‌వెయిట్ MMA ఛాంపియన్‌గా ఎన్నో రింగ్ ఫైట్స్‌లో రికార్డులు సృష్టించారు. గ్లోబల్ సెలబ్రిటీలు, అంతర్జాతీయ వీఐపీలకు అత్యున్నత స్థాయి క్లోజ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ అందించడంలో ఈయన సిద్ధహస్తుడు. ఇంతటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తిని చరణ్ తన భద్రత కోసం నియమించుకోవడంతో, అతనికి ఇచ్చే జీతంపై నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. కెవిన్‌కు రోజుకు దాదాపు రూ. 2 లక్షల వరకు చెల్లిస్తున్నారని, ఆ లెక్కన నెలకు అక్షరాలా రూ. 60 లక్షల వరకు పారితోషికం అందుతోందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అభిమానగణాన్ని సంపాదించుకున్న మన గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఇలాంటి అంతర్జాతీయ స్థాయి భద్రత ఖచ్చితంగా అవసరమేనని మెగా అభిమానులు సాషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 'గ్లోబల్ స్టార్ అంటే ఆ మాత్రం రేంజ్ ఉండాలి బాస్' అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న 'పెద్ది' చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో చూడాలని సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
May 25, 2026 6:37PM
రంగంలోకి చిరంజీవి.. శాంతించిన ఎగ్జిబిటర్స్.. 'పెద్ది'కి రూట్ క్లియర్!
సింగిల్ స్క్రీన్స్ కి పర్సెంటేజ్ విషయంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) దృష్టికి తీసుకొచ్చారు. విషయాలన్నీ పూర్తిగా విన్న చిరంజీవి పరిశ్రమ లో భాగస్వాములయిన అందరికీ పూర్తి న్యాయం జరిగేలా వుండాలని, ఒక్క సినిమా గురించో, ఒక్క సెక్టార్ గురించో ఈ చర్చ కాదని, అందరికీ ఆమోదయోగ్యంగా వుండాలనే పరిశ్రమ కొన్ని పద్దతులను ఏర్పరుచుకుంది అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి హైయెస్ట్ బాడీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్న విషయాన్ని గుర్తు చేసి, ఆ ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుండటం అందరికీ సముచితం అన్నారు. ఒకసారి అందరినీ సంప్రదించి, పర్సెంటేజ్ మోడల్ మీద ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఛాంబర్ ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ మీడియా ముందు ఏ ఒక్కరూ అభిప్రాయాలు వ్యక్తపరచటం తగదని అన్నారు. ఇలాంటి వాటివల్ల ఇండస్ట్రీ ఒక్కటిగా లేదన్న సందేశం ఇవ్వకూడదని అన్నారు. ఇంతకు ముందు వేసిన వేరే కమిటీల పనితీరు, ఫలితాల పట్ల సింగిల్ స్క్రీన్స్ సభ్యులలో కొంత అసంతృప్తి, అపనమ్మకం వుందన్న విషయం అర్ధం అయిందన్నారు. ఈ సారి ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ అనుకున్న గడువులో అంటే జూన్ 30వ తేదీ వరకూ, అన్ని విషయాలని పూర్తిగా పరిశీలించి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్ర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ న్యాయం జరిగేలా పర్సెంటేజ్ మోడల్ మీద ప్రతిపాదనని చేస్తుందని తనకు నమ్మకం వుందని, ఆ కమిటీ సకాలంలో తన బాధ్యతలు పూర్తిచేసి నివేదిక ఇవ్వటానికి తనవంతు కూడా పూర్తి ప్రయత్నం చేస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు. చిరంజీవి సమయం వెచ్చించి తమకున్న సమస్యలని, భయాలని, ప్రస్తుతం సింగిల్ స్క్రీన్స్ కి వున్న పరిస్థితులని అవగాహన చేసుకుని అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇవ్వటం పట్ల సభ్యులందరూ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. వారి అసోసియేషన్స్ లో వున్న మిగతా సభ్యులందరికి ఈ సమావేశం గురించి తెలియచేసి 24 గంటలలో తమ ఆమోదాన్ని తెలియచేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో TFCC ప్రెసిడెంట్ సురేష్ బాబు, TFDC చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, కేఎల్ నారాయణ, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
May 25, 2026 6:35PM
ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీ సాలిడ్ అప్డేట్ ఇచ్చిన బలగం సంజయ్.. ఆ లుక్ చూస్తే షాకవుతారు!
టాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘బలగం’ సంజయ్ కృష్ణ. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’(Peddi)లో నటిస్తున్న ఆయన, తదుపరి లైనప్‌తో టాలీవుడ్లో మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పిరియాడిక్ డ్రామా ‘ఫౌజీ’(Fauzi)లో కూడా సంజయ్ ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. తాజాగా తెలుగువన్(TeluguOne)కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ జర్నీ, ‘ఫౌజీ’ విశేషాలతో పాటు ప్రభాస్ లుక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (Actor Balagam Sanjay Interview) ఒకప్పుడు ఆడిషన్స్ కోసం ఇండస్ట్రీలో ఎంతో తిరిగిన సంజయ్ కృష్ణ.. ఇప్పుడు ‘బలగం’ తెచ్చిన గుర్తింపుతో ఆడిషన్స్ అవసరం లేకుండానే వరుసగా క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం చిన్న చిత్రాల దర్శకులు సైతం తన ఫేస్ వాల్యూ నమ్మి పోస్టర్లు, ట్రైలర్లలో ప్రాధాన్యత ఇస్తుండటంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తను చేసే ప్రతి పాత్ర కథతో ముడిపడి ఉండేలా, ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నట్లు తెలిపారు. రామ్‌చరణ్ ‘పెద్ది’ చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమాలో ఒక మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్లో నటించినట్లు సంజయ్ వెల్లడించారు. ఈ చిత్రం కోసం దాదాపు 4 నుండి 5 రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నానని చెప్పారు. అయితే ఆ తర్వాత ‘ఛాంపియన్’ వైజాగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్స్, ‘ఫౌజీ’ తదుపరి షెడ్యూల్ డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాలేదని.. అయినప్పటికీ తాను చేసినంత వరకు సీన్లు చాలా అద్భుతంగా వచ్చాయని పేర్కొన్నారు. డైరెక్టర్ హను రాఘవపూడి మేకింగ్ స్టైల్, విజన్‌పై సంజయ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన సాధారణ వ్యక్తి కాదని, సబ్జెక్ట్ మీద విపరీతమైన కమాండ్ ఉన్న దర్శకుడని కొనియాడారు. కచ్చితంగా ‘ఫౌజీ’ చిత్రం ప్రభాస్ కెరీర్లో ఒక మైండ్‌బ్లోయింగ్ హిట్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ అదిరిపోయే లుక్‌లో కనిపించబోతున్నారని, ఆయన లుక్ చూస్తే ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేయలేనంత షాక్‌కు గురవుతారని, అంత హ్యాండ్సమ్గా ప్రభాస్ కనిపించబోతున్నారని ఒక క్రేజీ లీక్ ఇచ్చారు. ఇక మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. చిరంజీవి గారు, వరుణ్ తేజ్, రామ్‌చరణ్, ఇప్పుడు సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ ఇలా కంటిన్యూస్‌గా మెగా హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం తన అదృష్టమని భావిస్తున్నట్లు చెప్పారు. ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ సంజయ్ దత్తో కలిసి ఒక హెవీ ఎమోషనల్ సీన్ చేశానని.. ఆ సీన్ చేస్తున్నప్పుడు క్యారెక్టర్లోకి లీనమై రియల్‌గా ఏడ్చేశానని గుర్తుచేసుకున్నారు. తన పర్ఫార్మెన్స్ చూసి సంజయ్ దత్ వెన్నుతట్టి "బాలా బాగుంది.. జబర్దస్త్ యాక్టింగ్" అంటూ హిందీలో ప్రశంసించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఎమోషనల్ అయ్యారు. తిరువీర్ ‘భగవంతుడు’ చిత్రంతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న సంజయ్.. ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా తన పేరు ముందున్న ‘బలగం’ అనే ట్యాగ్‌ను ఎప్పటికీ వదులుకోనని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్ల కష్టానికి గుర్తింపునిచ్చి, తనకు అన్నం పెట్టిన బేసిక్స్‌ను ఎప్పటికీ మర్చిపోనని సంజయ్ చెప్పారు.
May 25, 2026 5:04PM
Peddi: ‘పెద్ది’ సినిమాలో కుస్తీ ఎపిసోడ్ మీ ఊహలకి కూడా అందదు.. ‘బలగం’ సంజయ్ కామెంట్స్!
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ (Peddi). గ్రామీణ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న 'బలగం' ఫేమ్ సంజయ్ కృష్ణ, తెలుగువన్(TeluguOne)కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను, ముఖ్యంగా రామ్‌చరణ్‌తో చేసిన హై-వోల్టేజ్ కుస్తీ ఫైట్ ఎపిసోడ్స్ గురించి పంచుకున్నారు. (Balagam Sanjay Krishna Interview) ఈ సినిమాలో రామ్‌చరణ్ మేకోవర్, ఆయన బాడీ లాంగ్వేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని సంజయ్ కృష్ణ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయిగా ఇండస్ట్రీలో అన్ని ఉన్నప్పటికీ, రామ్‌చరణ్ పడుతున్న కష్టం, చూపిస్తున్న డెడికేషన్ చూస్తే ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. తన క్రేవింగ్స్ అన్నింటినీ చంపుకొని ఈ పాత్ర కోసం చరణ్ చేసిన హార్డ్ వర్క్, సాక్రిఫైస్ సినిమా స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుందని కొనియాడారు. సినిమాలో వచ్చే కుస్తీ ఎపిసోడ్ గురించి సంజయ్ మాట్లాడుతూ, ఇది ప్రేక్షకుల ఊహలకు కూడా అందనంత అద్భుతంగా ఉంటుందని స్పష్టం చేశారు. మీరు ట్రైలర్ లో చూసింది ఒక్క శాతమే అని, సినిమాలో ఆ ఎపిసోడ్ అంతకు ఎన్నో రెట్లు ఉంటుందని చెప్పారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఒరిజినల్ కుస్తీ పహిల్వాన్లను రంగంలోకి దించారని, దానివల్ల ఫైట్స్ చేస్తున్నప్పుడు చాలా రియలిస్టిక్‌గా వచ్చిందని చెప్పారు. అయితే రియల్ ఫైటర్స్ కావడంతో ఒక్కోసారి తెలియకుండానే ఎక్కువ ప్రెజర్ పెట్టేసేవారని, ఆ సమయంలో చరణ్‌కు ఎన్నో దెబ్బలు కూడా తగిలాయని సంజయ్ వెల్లడించారు. తాము కూడా సీన్ మూడ్‌లోకి వెళ్లి గట్టిగా పట్టుకున్నప్పుడు.. "సంజయ్ కూల్.. కూల్.. ఇట్స్ జస్ట్ యాక్టింగ్" అంటూ చరణ్ చాలా సరదాగా గైడ్ చేసేవారని గుర్తుచేసుకున్నారు. ట్రైలర్, టీజర్లో కనిపించిన క్రికెట్ పిచ్ నుండి కుస్తీ మైదానంలోకి మారే ఆ ట్రాన్స్ఫర్మేషన్ షాట్ గురించి సంజయ్ కృష్ణ ఆసక్తికర విషయాలు చెప్పారు. తాము సెట్స్‌లో రిహర్సల్స్ చేసి ఆ సీన్ చేశాం కానీ, స్క్రీన్ మీద అది అంత గొప్పగా వస్తుందని ఊహించలేదన్నారు. చరణ్ తనను గాలిలోకి లేపి తిప్పి పడేసే ఆ షాట్ కేవలం రెండో టేక్‌లోనే ఓకే అయిందని, షూట్ పూర్తయ్యాక తన టైమింగ్‌ను రామ్‌చరణ్ ప్రత్యేకంగా అభినందించారని సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. చరణ్ మెచ్చుకున్నారనే విషయం డైరెక్టర్ బుచ్చిబాబు వచ్చి తనకు చెప్పినప్పుడు ఒక నటుడిగా గర్వంగా అనిపించిందని అన్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు వర్కింగ్ స్టైల్ గురించి చెప్తూ.. ఆయన బయట చాలా సైలెంట్‌గా కనిపిస్తారు కానీ, సెట్స్‌లోకి వస్తే మాత్రం వర్క్ పిచ్చోడిగా మారిపోతారని సంజయ్ అన్నారు. ప్రతి నటుడి దగ్గరకు వచ్చి డైలాగ్ మాడ్యులేషన్, హ్యాండ్ మూమెంట్స్ చాలా ప్రాపర్ గా బ్రీఫ్ చేస్తారని కొనియాడారు. ఈ సినిమాలో చరణ్‌తో పాటు కన్నడ లెజెండ్ శివరాజ్‌కుమార్ లాంటి పెద్ద పెద్ద నటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టమని, ఒక బ్లెస్సింగ్‌లా భావిస్తున్నానని సంజయ్ చెప్పారు.
May 25, 2026 4:19PM
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్ చూద్దాం
ఎప్పటికప్పుడు తెలుగు సినిమా న్యూస్ సరికొత్త క్రేజీ అప్ డేట్ తో మీ ముందు ఉంటున్నాయి. మరి ఈ క్రేజీ న్యూస్ ఏంటో చూసేద్దాం 1 . హెల్లాల్లల్లో సాంగ్ రికార్డ్స్ మొన్న 23 న భూపాల్ సాక్షిగా పెద్ది నుంచి 'హెల్లాల్లల్లో' సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. అలా విడుదలైందో లేదో రికార్డులే నా చిరునామా అంటూ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 18 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక ప్రాంతీయ సినిమా నుంచి వచ్చిన సాంగ్ హిందీ, సౌత్ భాషల యూట్యూబ్ ట్రెండింగ్స్ లో అగ్రస్థానంలో నిలవడం పెద్ది స్టామినా ఏ పాటిదో తెలియచేస్తుంది. 2 . కోకాపేటలో ప్రభాస్ డ్రీమ్ హౌస్.. ఎకరం ధర వింటే షాక్ అవ్వాల్సిందే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్ కోకాపేట ఏరియాలో తన సరికొత్త డ్రీమ్ హౌస్ నిర్మాణ పనులని అధికారికంగా ప్రారంభించారు. అంతర్జాతీయ ఆర్కిటెక్ట్స్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండగా భారీ హోమ్ థియేటర్, అత్యాధునిక జిమ్నేషియం, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్పోర్ట్స్ ఏరియాని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.రెండు ఎకరాల్లో నిర్మాణం జరుపుకోనుండగా ఎకరం భూమి విలువ దాదాపు 150 కోట్లకి పైగా ఉంది. అంటే కేవలం ఆయన కొనుగోలు చేసిన ఈ రెండు ఎకరాల ఖాళీ స్థలం విలువే 300 కోట్లు. ప్రభాస్ డ్రీమ్ మ్యాన్షన్ గా నిర్మాణం జరుపుకోనుంది 3 . బండ్ల గణేష్‌ని చెప్పుతో కొట్టిన టాలీవుడ్ ప్రముఖుడు.. ఫ్యాన్స్ షాక్ బండ్ల గణేష్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు స్టార్ హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రోజే నా జీవితంలో చేదు సంఘటన జరిగింది. షూటింగ్ స్పాట్లో ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ పెద్దమనిషి పక్కన కూర్చున్నాను. నేను “సార్' అని పిలవగానే సదరు పెద్ద మనిషి చెప్పు తీసుకుని నన్ను కొట్టాడు. అయితే ఆ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది. నా దగ్గర డబ్బు లేదు. నేను బలహీనుడిని కాబట్టే నన్ను అలా అవమానించారనిపించింది. బయటకు వచ్చిన తర్వాత నాతో ఉన్న వ్యక్తితో ఒక మాట చెప్పాను. ఒక రోజు ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తా.. లేదంటే నా పేరు గణేష్ కాదు అని. గణేష్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 4 . పెద్ది వివాదంపై రంగంలోకి చిరంజీవి పెద్ది' నుంచే మాకు పర్సెంటేజ్(రెవెన్యూ షేరింగ్) సిస్టంని అందుబాటులోకి తీసుకురావాల్సిందే, లేదంటే ఆ తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోరని తెలంగాణ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీర్మానించిన విషయం తెలిసిందే. దీంతో మరో వారం రోజుల్లో పెద్ది రిలీజ్ ఉండటంతో ఫ్యాన్స్ సినీ ప్రేమికుల్లో టెన్షన్ మొదలయ్యింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సమస్యని పరిష్కరించడానికి స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈ రోజు సాయంత్రం చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్స్ తో సమావేశం జరగనుంది. 5 .వారణాసి క్రేజీ అప్ డేట్.. ఫ్యాన్స్ కాలర్ ఎత్తాల్సిందే మహేష్ బాబు, రాజమౌళిల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం "వారణాసి" (Varanasi). ఈ గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జూన్ రెండో వారం నుంచి మూవీకి అత్యంత కీలకమైన సుదీర్ఘ యాక్షన్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కంటిన్యూగా నెల రోజుల పాటు జరగనున్నట్టుగా సమాచారం 6 .పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి నిరాశ తప్పదా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'పంజా' ని రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశకి గురవుతున్నారు. 'పంజా' లో పవన్ లుక్స్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దాంతో చాలా మంది పవన్ అభిమానులు 'బద్రి' నే రీ రిలీజ్ చెయ్యాలని అభిప్రాయపడుతున్నారు. 7 . రోబోలు వచ్చే కాలంలో పిల్లలెందుకు.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్ వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ వంటి టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో మానవ సంబంధాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. కళ్లముందే కలియుగం కనిపించడంతో పాటు భవిష్యత్తు కాలం చాలా భయంకరంగా మారబోతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితులున్న సమాజంలోకి కేవలం మన స్వార్థం, సంతోషం కోసం పిల్లలని తీసుకురావడం కరెక్ట్ కాదని ఆయన చెప్పుకొచ్చాడు. 8 .పెద్దిపై పోసాని షాకింగ్ కామెంట్స్ పోసాని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ది’ రిలీజ్ కి అటుఇటుగా నా కొత్త సినిమా 'ఆపరేషన్ అరుణా రెడ్డి' రిలీజ్ కానుంది. అయితే చరణ్ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. 9 .ఫ్లాప్ హీరోలకి కూడా వందల కోట్లు బడ్జెట్ అంటున్న తమ్మారెడ్డి పరిశ్రమలో ఎప్పుడైనా సరే కేవలం ఐదు శాతం సినిమాలు మాత్రమే లాభాలను తెచ్చిపెడతాయని, మిగిలిన తొంభై ఐదు శాతం చిత్రాలు నష్టాలనే మిగులుస్తాయని ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెబుతున్నారు. ముఖ్యంగా హీరోల పారితోషికాల విషయంలో నిర్మాతల వైఖరి మారాలి. వరుస ఫ్లాపులు ఇస్తున్న హీరోలకి సైతం వందల కోట్ల బడ్జెట్ కేటాయించి, భారీగా రెమ్యునరేషన్లు ఇస్తున్న నిర్మాతలు నేడు ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పుకొచ్చాడు 10 .శ్రీను వైట్ల, శర్వానంద్ తో విశ్వంభర భామ! దర్శకుడు శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబోలో ఒక మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ ని ఫిక్స్ చేసినట్లుగా సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న తాజా న్యూస్ . ఈ సంక్రాంతికి రవితేజతో కలిసి భర్త మహాశయులకు విజ్ఞప్తితో మెప్పించిన ఆషికా,మెగా స్టార్ విశ్వంభరలో కనువిందుచేయనున్న విషయం తెలిసిందే.
May 25, 2026 2:58PMచిరంజీవి ఆర్డర్ వేయకపోతే ఆ సీన్స్ కట్ చేసేవాళ్లు: చరణ్ సినిమా సీక్రెట్ బయటపెట్టిన పోసాని!
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ గుణగణాలపై చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ పాజిటివ్ టాక్ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన సెట్స్‌లో తోటి నటీనటులతో ప్రవర్తించే తీరు, ఇచ్చే గౌరవం అద్భుతమని చాలా మంది చెబుతుంటారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి సైతం చరణ్ సంస్కారాన్ని కొనియాడారు. చరణ్ రాబోయే భారీ చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా మెగాఫోన్ పట్టిన లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ అరుణా రెడ్డి’. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ తాజా ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ.. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పెద్ది’ సినిమా విడుదలకు అటుఇటుగా తమ సినిమా కూడా థియేటర్లలోకి రానుందని, అయితే చరణ్ సినిమా పెద్ద హిట్ కావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌తో కలిసి తాను నటించిన సూపర్ హిట్ చిత్రం ‘నాయక్’ నాటి ఒక అపురూపమైన సంఘటనను పోసాని గుర్తుచేసుకున్నారు. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో చరణ్ పక్కన పోసాని చేసిన కామెడీ ట్రాక్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది. కొన్ని సీన్లలో హీరో కంటే తన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత లభించిందని, స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగా దక్కిందని పోసాని పేర్కొన్నారు. సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా తనను డామినేట్ చేసేలా సీన్లు ఉంటే ఈగో ఫీలవుతారని, కానీ చరణ్ మాత్రం ఎంతో గొప్పగా ప్రవర్తించారని పోసాని అన్నారు. ఆ సమయంలో చరణ్ తనను ప్రత్యేకంగా పిలిచి.. "పోసాని గారు.. నాన్న సినిమా చూశారు. మీ సీన్లు థియేటర్లలో బాగా పేలుతాయని చెప్పారు. మీ ఉన్న ఒక్క సీన్ కూడా ఎడిటింగ్‌లో తీసేయొద్దని నాన్న ఆర్డర్ వేశారు" అని ఎంతో సంతోషంగా చెప్పినట్లు పోసాని వెల్లడించారు. తోటి నటీనటుల ప్రతిభను అంతలా గౌరవించే గొప్ప మనసు, సంస్కారం రామ్ చరణ్ కి ఉన్నాయని పోసాని ప్రశంసించారు. అందుకే అంత మంచి వ్యక్తి నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు, రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పోసాని ‘ఆపరేషన్ అరుణా రెడ్డి’తో పాటు చరణ్ ‘పెద్ది’ కూడా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి.
May 25, 2026 12:57PM
Peddi: పెద్ది వివాదంపై రంగంలోకి చిరంజీవి.. ఎగ్జిబిటర్లతో సమావేశంలో జరగబోయేది ఇదేనా!
'పెద్ది'(Peddi)నుంచే మాకు పర్సెంటేజ్(రెవెన్యూ షేరింగ్) సిస్టంని అందుబాటులోకి తీసుకురావాల్సిందే, లేదంటే ఆ తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోరని తెలంగాణ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ భీష్మించుకుని కూర్చున్న విషయం తెలిసిందే. దీంతో మరో వారం రోజుల్లో పెద్ది రిలీజ్ ఉండటంతో ఫ్యాన్స్ సినీ ప్రేమికుల్లో టెన్షన్ మొదలయ్యింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)సమస్యని పరిష్కరించడానికి స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈ రోజు సాయంత్రం చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్స్ తో మీటింగ్ జరగనుంది. ఎగ్జిబిటర్స్ వాదన ప్రకారం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 120 కి పైగా థియేటర్ల యజమానులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని, దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పర్సెంటేజ్ సిస్టమ్ నడుస్తుంటే, ఇక్కడ మాత్రం ఇంకా పాత రెంట్ల పద్ధతిని కొనసాగించడం అన్యాయమనేది వారి వాదన. ఈ పరిస్థితుల్లో చిరంజీవి స్వయంగా ఎగ్జిబిటర్ల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానుండటం ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన కొడుకు రామ్ చరణ్ సినిమా విడుదల కానుండటం, అలాగే పరిశ్రమ సంక్షేమం దృష్ట్యా చిరంజీవి ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని చిరు భావిస్తున్నారు. మరోవైపు, టికెట్ ధరల పెంపుదలపై కూడా తెలంగాణ ఎగ్జిబిటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే టికెట్ ధరలు పెంచవద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి లేఖలు రాశారు. ఒకవేళ టికెట్ల రేట్లు విపరీతంగా పెంచితే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని, దీనివల్ల తమకు వచ్చే అరకొర కలెక్షన్లలో మళ్లీ నిర్మాతలకు అదనపు వాటాలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. మల్టీప్లెక్స్ చైన్లకు ఇస్తున్నట్లే తమకు కూడా కలెక్షన్ల ఆధారంగా పర్సెంటేజ్ షేరింగ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. థియేటర్ల ఏసీలు, సౌండ్ సిస్టమ్స్ ఆధారంగా కాకుండా వచ్చే కలెక్షన్లను బట్టి మాత్రమే గ్రేడింగ్ చేయాలనేది ఎగ్జిబిటర్ల ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్లన్నింటినీ చిరంజీవి నేతృత్వంలో జరిగే సమావేశంలో ఎగ్జిబిటర్లు ఆయన ముందు ఉంచబోతున్నారు ఈ వివాదంపై నిర్మాత డి. సురేష్ బాబు ఫిల్మ్ ఛాంబర్ తరఫున ఒక లేఖ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 'పెద్ది' సినిమాకు టికెట్ రేట్లు పెంచితే నెట్ కలెక్షన్లపై 7.5 శాతం అదనపు వాటా నిర్మాతలకు ఇవ్వాలని, అలాగే ప్రీమియర్ షోల విషయంలో 'ఎ' సెంటర్లలో 25,000 రూపాయలు, 'బి' సెంటర్లలో 15,000 రూపాయలు, 'సి' సెంటర్లలో 5,000 రూపాయలు చొప్పున చెల్లించేలా సబ్ కమిటీ ఒక ఫార్ములాను ప్రతిపాదించిందని పేర్కొన్నారు. అయితే, ఛాంబర్ ప్రతిపాదించిన ఈ 'రేట్ల పెంపు - అదనపు పర్సెంటేజ్' ఫార్ములాను తెలంగాణ ఎగ్జిబిటర్లు పూర్తిగా తిరస్కరించారు. ఛాంబర్ చెబుతున్నవన్నీ ఏకపక్ష నిర్ణయాలని, కొందరు నిర్మాతల ప్రయోజనాల కోసమే గ్రౌండ్ లెవెల్ ఎగ్జిబిటర్లను బలి చేస్తున్నారని మండిపడ్డారు. Also read: Peddi: 24 గంటల్లో హెల్లాల్లల్లో సాంగ్ వ్యూస్ రికార్డు ఇదే.. మరి థియేటర్స్ లో ఎలా ఉంటుందో సునీల్ నారంగ్ స్థానంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జువ్వాడి శేఖర్ రావు నేతృత్వంలో ఎగ్జిబిటర్లు తమ పట్టు వీడటం లేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఆధ్వర్యంలో జరగబోయే ఈ మీటింగ్ అత్యంత కీలకంగా మారింది. టాలీవుడ్ పెద్ద దిక్కుగా పిలవబడుతున్న చిరంజీవి ఎగ్జిబిటర్లు కి, నిర్మాతలకి వివాదానికి ఎలాంటి పరిష్కారం చూపుతారో అని పరిశ్రమ వర్గాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
May 25, 2026 9:09AM
Peddi: 24 గంటల్లో హెల్లాల్లల్లో సాంగ్ వ్యూస్ రికార్డు ఇదే.. మరి థియేటర్స్ లో ఎలా ఉంటుందో
మొన్న 23 న భూపాల్ సాక్షిగా పెద్ది(Peddi)నుంచి 'హెల్లాల్లల్లో'(Hellallallo)సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. అలా విడుదలైందో లేదో రికార్డులే నా చిరునామా అంటూ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. దీంతో పెద్ది పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు వేరు 'హెల్లాల్లల్లో' వచ్చాక అంచనాలు వేరు అనేలా ఉంది పరిస్థితి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 18 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక ప్రాంతీయ సినిమా నుంచి వచ్చిన సాంగ్ హిందీ, సౌత్ భాషల యూట్యూబ్ ట్రెండింగ్స్ లో అగ్రస్థానంలో నిలవడం పెద్ది స్టామినా ఏ పాటిదో తెలియచేస్తుంది. అనంత శ్రీరామ్ స్వర రచనలో రాగా తెలుగు వర్షన్ కి రక్షిత సురేష్ తన వాయిస్‌తో మరింత ఎనర్జీని తీసుకొచ్చాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ లెజెండ్ ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ 'హెల్లాల్లల్లో' పాట మెగా అభిమానులకి మాస్ ఆడియన్స్‌కు ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్‌లా నిలిచింది. రామ్ చరణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అందించిన అదిరిపోయే హుక్ స్టెప్స్‌కి రామ్ చరణ్ తనదైన శైలిలో అద్భుతమైన గ్రేస్‌తో స్టెప్పులేశారు. గ్లామరస్ బ్యూటీస్ శృతి హాసన్, జాన్వీ కపూర్ ఇద్దరూ చరణ్‌తో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకుంటూ తమ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులని కట్టిపడేశారు. అందుకే రికార్డు వ్యూస్. మరి పల్లెటూరి జాతర నేపథ్యంలో కలర్‌ఫుల్ విజువల్స్, అడిక్టివ్ మాస్ బీట్స్ ,ఫోక్ ఎనర్జీతో ఉన్న ఈ సాంగ్ రేపు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే టైంలో ముందు ముందు 'హెల్లాల్లల్లో' రికార్డ్స్ ఎలా ఉంటాయో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న పెద్దికి బుచ్చిబాబు దర్శకుడు అనే విషయం తెలిసిందే.
May 25, 2026 8:39AM'పెద్ది' సినిమా చేయడానికి రీజన్ 'బాహుబలి'.. అసలు విషయం చెప్పేసిన ఎ.ఆర్.రెహమాన్!
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చాలా విరామం తర్వాత నేరుగా ఒక తెలుగు సినిమాకు సంగీత సింహాసనాన్ని అధిష్టించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' (RC 16) చిత్రానికి ఆయన మ్యూజిక్ అందిస్తున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆయన టాలీవుడ్ ప్రాజెక్ట్‌ను లైన్లోకి తెచ్చుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తాజాగా ఒక వేదికపై పంచుకున్నారు. భోపాల్‌లో నిర్వహించిన ఒక గ్రాండ్ ఈవెంట్లో పాల్గొన్న ఏఆర్ రెహమాన్, తెలుగు చిత్ర పరిశ్రమపై తనకున్న ప్రేమాభిమానాలను బయటపెట్టారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం సాధించిన అంతర్జాతీయ స్థాయి విజయమే తనను మళ్లీ టాలీవుడ్ వైపు చూసేలా చేసిందని ఆయన వెల్లడించారు. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం చూశాక, తాను కూడా ఒక అద్భుతమైన తెలుగు సినిమాకు పని చేయాలనే బలమైన కోరిక కలిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సరిగ్గా అదే సమయంలో దర్శకుడు బుచ్చిబాబు సానా తనకు 'పెద్ది' కథను వినిపించారని రెహమాన్ తెలిపారు. అత్యంత ఎమోషనల్ అండ్ రస్టిక్ విలేజ్ డ్రామాగా సాగే ఈ స్క్రిప్ట్ తనను ఎంతగానో ఆకట్టుకుందని, అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పారు. ఇలాంటి ఒక విలక్షణమైన సబ్జెక్ట్‌తో పాటు రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లో భాగం కావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని మ్యూజిక్ మాస్ట్రో వివరించారు. గతంలో ఏఆర్ రెహమాన్ తెలుగులో 'నాని', 'కొమరం పులి', 'సాహసం శ్వాసగా సాగిపో' వంటి చిత్రాలకు ఎవర్గ్రీన్ ఆల్బమ్స్ అందించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆయన స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు కొంత దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ మెగా పవర్‌స్టార్ సినిమాతో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇస్తుండటంతో అటు మెగా అభిమానుల్లో, ఇటు సంగీత ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజ్ కి తగ్గట్టుగానే నిన్నటి భోపాల్ ఈవెంట్లో 'పెద్ది' సినిమాకు సంబంధించిన రెండు స్పెషల్ సాంగ్స్‌ను రెహమాన్ తన మ్యూజికల్ టీమ్‌తో కలిసి స్టేజ్‌పై లైవ్‌గా పర్ఫార్మ్ చేశారు. రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా, సోషల్ మీడియాలో సైతం ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ పాటల స్టైల్ చూస్తుంటే బుచ్చిబాబు సానా మరోసారి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. భారీ బడ్జెట్ మరియు అత్యున్నత సాంకేతిక విలువల మధ్య తెరకెక్కుతున్న ఈ 'పెద్ది' సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని క్రేజీ అప్డేట్స్తో పాటు ఫస్ట్ లుక్ లేదా టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. టాలీవుడ్లో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
May 24, 2026 12:06PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com







