వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాకి ఎవరూ ఊహించని టైటిల్!
on Dec 1, 2025

వెంకటేష్(Venkatesh) హీరోగా నటించిన 'నువ్వు నాకు నచ్చావ్', 'వాసు', 'మల్లీశ్వరి' వంటి సినిమాలకు త్రివిక్రమ్(Trivikram) రచయితగా పనిచేశారు. దర్శకుడిగా మాత్రం వెంకటేష్ తో త్రివిక్రమ్ ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. దీంతో వీరి కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ గా మారిన రెండు దశాబ్దాల తరువాత ఎట్టకేలకు వెంకటేష్ తో త్రివిక్రమ్ చేతులు కలిపారు.
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ, నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'బంధుమిత్రుల అభినందలతో' అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: ప్రభాస్ బాటలో రామ్ పోతినేని!
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో అంటే ఆడియన్స్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఆశిస్తారు. అందుకు తగ్గట్టుగానే కడుపుబ్బా నవ్వించే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో.. ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారట.
ఇక ఇప్పుడు 'బంధుమిత్రుల అభినందలతో' అనే అచ్చ తెలుగు టైటిల్ ఈ సినిమాకి పెట్టారనే వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ టైటిల్ కి తగ్గట్టుగానే వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి విందు భోజనం లాంటి సినిమాని అందిస్తారేమో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



