Home

»

Gossips

‘కరుప్పు’ హిట్‌తో త్రిష రెమ్యున‌రేష‌న్‌కి రెక్క‌లొచ్చాయి.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

Jun 14, 2026 2:12PM

సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్‌గా వెలుగువెలుగుతున్న చెన్నై చంద్రం త్రిష ప్రస్తుతం సరికొత్త సెన్సేషన్‌కు తెరలేపింది. సాధారణంగా చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే నటీనటులకు డిమాండ్ ఉంటుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ సీనియర్ భామ, ఇప్పుడు తనకున్న క్రేజ్‌ను ఊహించని రేంజ్‌లో క్యాష్ చేసుకునే పనిలో పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

తాజాగా ఫిలింనగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఒక భారీ ద్విభాషా (తెలుగు-తమిళ) చిత్రం కోసం మేకర్స్ త్రిషను సంప్రదించగా ఆమె మైండ్ బ్లాక్ అయ్యే రేటు చెప్పిందట. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటించడానికి ఈ సీనియర్ బ్యూటీ ఏకంగా రూ. 15 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు టాక్ నడుస్తోంది. హీరోయిన్ల రెమ్యునరేషన్స్ విషయంలో ఈ స్థాయి ఫిగర్ వినపడటం టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.

నిజానికి ఇటీవల సూర్య హీరోగా వచ్చిన 'కరుప్పు' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో త్రిష మార్కెట్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. ఈ వయసులోనూ గ్లామర్, యాక్టింగ్ పరంగా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుండటంతో ఆమె ఖాతాలో వరుసగా పెద్ద ప్రాజెక్టులు వచ్చి చేరుతున్నాయి. దీంతో త్రిష కూడా తన పారితోషికాన్ని భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది.

గతంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్న 'విశ్వంభర' సినిమా కోసం త్రిష దాదాపు రూ. 4 కోట్ల వరకు అందుకున్నట్లు సమాచారం. కానీ, 'కరుప్పు' బ్లాక్‌బస్టర్ తర్వాత ఆమె తన రేంజ్‌ను ఒక్కసారిగా త్రిబుల్ చేయడంతో సదరు నిర్మాత ఇప్పుడు అవాక్కయ్యారట. ప్రస్తుతం ఆమెను కనీసం రూ. 10 కోట్ల బడ్జెట్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు సదరు చిత్ర బృందం గట్టిగా బేరసారాలు సాగిస్తున్నట్లు టాక్.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న లేడీ సూపర్‌స్టార్ నయనతార రికార్డులను సైతం త్రిష ఈ కొత్త డిమాండ్‌తో దాటేసేలా కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ వార్తలపై అభిమానులు, సినీ ప్రియులు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి ఈ రూ. 15 కోట్ల డీల్‌కు సదరు టాలీవుడ్-కోలీవుడ్ నిర్మాతలు తలొగ్గుతారో లేదో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com