విజయ్ దేవరకొండ సినిమాలో ‘ది మమ్మీ’ విలన్?
on Nov 4, 2024
విజయ్ దేవరకొండ.. అర్జున్‌రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత గీత గోవిందం చిత్రంతో అతనికి మరింత ఫాలోయింగ్ వచ్చేసింది. నోటా చిత్రం పరాజయంతో కాస్త వెనపడ్డాడు విజయ్. ఆ సమయంలో టాక్సీవాలా చిత్రంతో మరో సూపర్‌హిట్ అందించాడు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు ఇప్పటివరకు మరో సాలిడ్ హిట్ పడలేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలు ఫ్లాప్ అవడంతో పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో చేసిన లైగర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ, అది డిజాస్టర్ కావడంతో అతను ఆలోచనలో పడ్డాడు. సినిమాల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా అతన్ని ఫ్లాప్‌లు వెంటాడుతూనే ఉన్నాయి. ఖుషి, ది ఫ్యామిలీస్టార్ వంటి సినిమాలు అతని ఫ్లాప్‌ల ఖాతాలో చేరిపోయాయి. అతనికి వరస ఫ్లాప్‌లు వస్తున్నప్పటికీ అవకాశాలు మాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో విజయ్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసేందుకు మేకర్స్ కృషి చేస్తున్నారు. గౌతమ్ దర్శకత్వంలోనే మరో రెండు సినిమాలు చేసేందుకు విజయ్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. టాక్సీవాలా చిత్రంతో విజయ్‌కి హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని గతంలోనే ప్రకటించినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడా ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని, వచ్చే ఏడాదిలోనే సినిమాను విడుదల చేయబోతున్నారని సమాచారం.
డైరెక్టర్ రాహుల్ చేసే సినిమాలన్నీ ఎంతో విభిన్నంగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఉంటుందట. ఈ కాన్సెప్ట్ విజయ్‌కి కూడా బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన మరో ప్రత్యేకత ఏమిటంటే.. ది మమ్మీ సినిమాలో విలన్‌గా నటించిన అర్నాల్డ్ ఓస్లూ ఓ కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. మమ్మీ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అర్నాల్డ్‌తో ఈ క్యారెక్టర్ చేయించేందుకు చర్చలు జరుపుతున్నారని సమాచారం. భారీ పీరియాడికల్ వార్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోందని, ఈ సినిమాలో చారిత్రాత్మక నేపథ్యం కూడా ఉంటుందని తెలుస్తోంది. వరస పరాజయాలతో సతమతమవుతున్న విజయ్‌కి ఈ సినిమా ఎంతో కీలకంగా మారబోతోంది. మరి విజయ్ సినిమాకి హాలీవుడ్ స్టార్ ఎంతవరకు ప్లస్ అవుతాడో చూడాలి.
Also Read