ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా రానా..!
on Jun 30, 2025
ఆగస్టు 14న బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రస్తుతం 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటి తర్వాత ఎన్టీఆర్ లిస్టులో పలు సినిమాలు ఉన్నాయి. అందులో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఒకటి. ఈ చిత్రం ప్రతినాయకుడి పాత్ర కోసం రానా దగ్గుబాటిని రంగం దింపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఓ మైథలాజికల్ సినిమా కోసం చేతులు కలుపుతున్నారు. గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామి కథతో ఇది తెరకెక్కనుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందనుంది. అయితే ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్ర కోసం రానాను తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. రానా సైతం ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
రానా కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా ఇతర హీరోల సినిమాల్లోనూ విభిన్న పాత్రలు పోషిస్తుంటాడు. బాహుబలి, భీమ్లా నాయక్ వంటి సినిమాల్లో రానా తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తో అంతకుమించి సర్ ప్రైజ్ చేయడం ఖాయమంటున్నారు.
త్రివిక్రమ్, రానా మధ్య మంచి అనుబంధముంది. పవన్ కళ్యాణ్ తో కలిసి రానా నటించిన 'భీమ్లా నాయక్'కి త్రివిక్రమ్ రచయితగా వ్యవహరించాడు. అలాగే రానా తలపెట్టిన 'హిరణ్యకశ్యప్'కి కూడా త్రివిక్రమ్ నే రైటర్ గా ప్రకటించారు. ఆ అనుబంధంతోనే ఎన్టీఆర్ తో చేయనున్న మైథలాజికల్ సినిమాలో రానాని భాగం చేయాలని త్రివిక్రమ్ భావించాడట. నటుడిగా రానా ఎంతో ప్రతిభ ఉంది. పైగా వివిధ భాషల ప్రేక్షకులకు రానా సుపరిచితుడు. ఇవన్నీ చూసుకొని రానా పర్ఫెక్ట్ అని సెలెక్ట్ చేసినట్లు వినికిడి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
