రామ్ చరణ్ చేతికి అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్!
on Apr 15, 2025
రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా కమిటై ఉన్నాడు చరణ్. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులతో చరణ్ సినిమాలు చేసే అవకాశముందని వార్తలు వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తూ.. ముందుగా సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. (Sandeep Reddy Vanga)
'యానిమల్'తో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా సందీప్ రెడ్డి మారిపోయాడు. ప్రస్తుతం సందీప్ చేతిలో ప్రభాస్ 'స్పిరిట్', రణబీర్ కపూర్ 'యానిమల్ పార్క్' ఉన్నాయి. వీటితో పాటు, అల్లు అర్జున్ తోనూ ఒక సినిమా కమిటై ఉన్నాడు. బన్నీ-సందీప్ కలయికలో రెండేళ్ల క్రితం టీ-సిరీస్ ఒక భారీ సినిమాని ప్రకటించింది. అనౌన్స్ మెంట్ తప్ప, ఆ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ లేవు. దీంతో అసలు ఈ మూవీ పట్టాలెక్కుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది కానీ, హీరో మారిపోతున్నాడని వినికిడి. అల్లు అర్జున్ స్థానంలో రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. (Allu Arjun)
బన్నీ 'పుష్ప-2' సమయంలో సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. పుష్ప-2 విడుదలై భారీ విజయం సాధించింది. అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలను అట్లీ, త్రివిక్రమ్ లతో చేయనున్నాడు. ఆ తర్వాత పుష్ప-3 చేయాల్సి ఉంది. ఇవి పూర్తి కావడానికి కనీసం మూడు నాలుగేళ్లు పడుతుంది. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ లోకి రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. పెద్ది, సుకుమార్ ప్రాజెక్ట్ తర్వాత చరణ్ చేయబోయే సినిమా సందీప్ రెడ్డితోనే ఉండే అవకాశముంది అంటున్నారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
