లేడీ డైరెక్టర్ తో నితిన్ లవ్ స్టోరీ..!
on Dec 8, 2025

వరుస ఫ్లాప్స్ లో నితిన్
ఇంతవరకు కొత్త సినిమాపై క్లారిటీ లేదు
ఆ డైరెక్టర్ తో లవ్ స్టోరీ నిజమేనా..?
2020లో వచ్చిన 'భీష్మ' తరువాత హీరో నితిన్ హిట్ చూడలేదు. ఈ ఐదేళ్ళలో వరుసగా ఆరు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ చూశాడు. దీంతో నితిన్ నెక్స్ట్ ఎవరి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు? దాంతోనైనా కమ్ బ్యాక్ ఇస్తాడా? అనే ఆసక్తి నెలకొంది.
నితిన్ తదుపరి సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. వేణు యెల్దండి దర్శకత్వంలో 'ఎల్లమ్మ' అనే సినిమా చేయాల్సి ఉండగా.. ఎందుకో దాని నుండి అవుట్ అయ్యాడు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తలపెట్టిన సినిమా కూడా ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి. శ్రీను వైట్ల ప్రాజెక్ట్ ప్రచారానికే పరిమితమైంది. 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ సాయి మార్తాండ్ దర్శకత్వంలో సినిమా అంటూ ఇటీవల న్యూస్ వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది.
ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన.. ఈ ఏడాది 'తెలుసు కదా' సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
నిజానికి 'తెలుసు కదా' కథ మొదట నితిన్ దగ్గరికే వెళ్ళింది. కానీ, ఏవో కారణాల వల్ల చేయలేదు. అయితే ఇప్పుడు దర్శకురాలిగా నీరజ కోన చేయనున్న రెండో సినిమాకి మాత్రం నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదొక లవ్ స్టోరీ అని సమాచారం.
లవ్ స్టోరీలు నితిన్ కి బాగా కలిసి వస్తాయి. గతంలో వరుస ఫ్లాప్స్ లో ఉన్న నితిన్.. 'ఇష్క్' అనే లవ్ స్టోరీ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



