'విశ్వంభర' ఐటెం సాంగ్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ!
on Jul 1, 2025
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ ఫిల్మ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
'విశ్వంభర' షూటింగ్ దాదాపు పూర్తయింది. ఒక్క ఐటెం సాంగ్ తప్ప మిగతా షూటింగ్ అంతా పూర్తయిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ఐటెం సాంగ్ ని కూడా చిత్రీకరించనున్నారని సమాచారం. ఇక ఈ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ 'నాగిని' ఫేమ్ మౌని రాయ్ చిందేయనుందని టాక్. ఈ ఐటెం సాంగ్ మాస్ కి ఫీస్ట్ లా ఉంటుందని అంటున్నారు.
ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న 'విశ్వంభర'లో పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. ఇప్పటికే మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ అదిరిపోయిందనే టాక్ వచ్చింది. ఇక ఐటెం సాంగ్ కూడా ఒక ఊపు ఊపేలా ఉంటుందని చెబుతున్నారు.
సోషియో ఫాంటసీ ఫిల్మ్ అయినప్పటికీ మెగా అభిమానులు, మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు 'విశ్వంభర'లో పుష్కలంగా ఉంటాయట. ముఖ్యంగా అదిరిపోయే సాంగ్స్, మెగాస్టార్ మార్క్ స్టెప్పులతో.. మెగా ట్రీట్ ఉంటుందని చెప్తున్నారు.
'విశ్వంభర'లో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఛోటా కె. నాయుడు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్స్ గా కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి వ్యవహరిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
