నాని హిట్-3 మూవీలో మరో స్టార్..!
on Apr 2, 2025
నేచురల్ స్టార్ నాని(Nani)కి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో రూపొందే 'హిట్' ప్రాంఛైజ్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. శైలేశ్ కొలను దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ ప్రాంఛైజ్ లో ఇప్పటిదాకా రెండు సినిమాలు రాగా.. రెండూ విజయం సాధించాయి. మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండో భాగంలో అడివి శేష్ నటించారు. మూడో భాగంలో నాని నటిస్తున్నాడు. 'హిట్-3' మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే 'హిట్-3'లో మరో హీరో ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. (HIT 3)
'హిట్-2' చివరిలో నాని పాత్రను పరిచయం చేసి, 'హిట్-3'కి లీడ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'హిట్-3' చివరిలో కూడా ఒక పాత్రను ఇంట్రడ్యూస్ చేసి, 'హిట్-4'కి లీడ్ ఇవ్వబోతున్నారట. అందుకోసం ఒక క్రేజీ హీరోని రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్.
'హిట్' ప్రాంఛైజ్ లో నందమూరి బాలకృష్ణ, రవితేజ వంటి స్టార్స్ భాగమయ్యే అవకాశముందని ఆమధ్య వార్తలొచ్చాయి. కానీ, ఇప్పుడు దుల్కర్ సల్మాన్ పేరు తెరపైకి వచ్చింది. దుల్కర్ కి తెలుగునాట మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో తెలుగులో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం 'ఆకాశంలో ఒక తార' అనే తెలుగు సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో 'హిట్' ప్రాంఛైజ్ లో దుల్కర్ భాగమయ్యాడనే వార్త ఆసక్తికరంగా మారింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
