Akhanda 2: బిగ్ సర్ ప్రైజ్.. 'అఖండ-2'లో చిరంజీవి..!
on Nov 29, 2025

సీనియర్ స్టార్స్ లో చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna)లకు ఉండే క్రేజే వేరు. వీరి సినిమాల విడుదల సమయంలో తెలుగునాట పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక ఇద్దరూ బాక్సాఫీస్ దగ్గర తలపడితే.. సరికొత్త రికార్డులు నమోదవుతాయి. అలాంటిది ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది?.. ఆ ఊహే గూస్ బంప్స్ తెప్పిస్తుంది కదా.. త్వరలోనే అది సాధ్యం కానుందనే మాట బలంగా వినిపిస్తోంది.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన 'అఖండ-2' డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య మరోసారి అఘోరగా నట విశ్వరూపం చూపనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఒక సంచలన న్యూస్ చక్కర్లు కొడుతోంది. (Akhanda 2 Thaandavam)
'అఖండ-2' క్లైమాక్స్ లో శివుని పాత్రలో చిరంజీవి కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో శివుడిగా చిరు కనిపించారు. శ్రీ మంజునాథ చిత్రంలో శివుడి పాత్రలో చిరంజీవి ఒదిగిపోయిన తీరు అద్భుతం. ఇప్పుడు బాలయ్య కోసం ఆయన మరోసారి శివుడిగా కనిపించబోతున్నారని టాక్ నడుస్తోంది.
అసలే అఘోరగా బాలయ్య తాండవం. ఇప్పుడు దానికి తోడుగా శివ పాత్రలో చిరు కనిపిస్తే.. ఇక 'అఖండ-2'పై హైప్ ఏ రేంజ్ కి వెళ్తుందో మాటల్లో వర్ణించడం కష్టం.
Also Read: ప్రభాస్, అనుష్క పెళ్ళి వీడియో వైరల్!
సినీ పరిశ్రమలో బాలకృష్ణ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ ఏడాది స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ ఈవెంట్ కి హాజరైన చిరంజీవి.. మంచి కథ కుదిరితే బాలకృష్ణతో కలిసి నటిస్తానని అన్నారు. ఆ టైంలో ఆ కామెంట్స్ ఎంతో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు 'అఖండ-2'లో చిరంజీవి కనిపిస్తారని వార్త ఆసక్తికరంగా మారింది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



