తండేల్ దర్శకుడితో రామ్.. బొమ్మ దద్దరిల్లిపోద్ది!
on Mar 13, 2025
హీరో రామ్ పోతినేని ప్రస్తుతం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'ఆంధ్రా కింగ్ తాలూకా' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దీని తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రామ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. (Ram Pothineni)
'కార్తికేయ 2'తో పాన్ ఇండియా సక్సెస్ చూసిన చందు మొండేటి.. ఇటీవల 'తండేల్'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. 'తండేల్' తర్వాత సూర్యతో ఒక సినిమా చేయాలని భావించాడు చందు. అయితే, సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'కార్తికేయ 3' చేయాలనే ఆలోచనలో కూడా చందు ఉన్నాడు. కానీ, దానికి సమయం పట్టే అవకాశముంది. ఈ క్రమంలో అనూహ్యంగా రామ్ పేరు తెరపైకి వచ్చింది.
రామ్ కోసం చందు ఒక కథని సిద్ధం చేస్తున్నాడట. ఇప్పటికే రామ్, చందు మధ్య కథా చర్చలు జరిగాయని.. చందు చెప్పిన స్టోరీ లైన్ కి రామ్ ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది. 'తండేల్'ను నిర్మించిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని వినికిడి. రామ్ పుట్టినరోజు సందర్భంగా మే 15న ఈ సినిమాని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
