
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో ఒక భారీ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఊహించని మలుపులు తిరుగుతోంది. గతంలో ఈ సినిమాకు సంబంధించి రకరకాల చర్చలు నడిచినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వైపు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. బాలయ్య మార్కెట్, ఆయనకున్న మాస్ ఇమేజ్ కు తగినట్లుగా వివేక్ ఆత్రేయ ఒక విభిన్నమైన లైన్ సిద్ధం చేసినట్లు టాక్.
బాలకృష్ణ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ ఒక సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ రవితేజ (RaviTeja) చేతుల్లోకి వెళ్లినట్టు న్యూస్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం, మళ్ళీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ బాలయ్య చేతికే వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరో సెన్సేషనల్ అప్‌డేట్ ఏంటంటే, ఇందులో కేవలం బాలకృష్ణ మాత్రమే కాకుండా మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నారట. వివేక్ ఆత్రేయ చెప్పిన కథ విన్న మోహన్ లాల్, ఇందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
ఇద్దరు అగ్ర కథానాయకులు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఆ మజానే వేరు. ఒకవైపు బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, మరోవైపు మోహన్ లాల్ క్లాసిక్ పర్‌ఫార్మెన్స్ తో కూడిన ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే, అది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ క్రేజీ కాంబినేషన్‌ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది.
అయితే ఈ మైత్రీ-వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ గనుక ఈ విధంగా బాలయ్య, మోహన్ లాల్ కాంబినేషన్ లో ఫైనల్ అయితే, ఇండస్ట్రీలో మరో ఆసక్తికరమైన మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ ఈక్వేషన్ సెట్ అయిన పక్షంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మాస్ మహారాజా రవితేజ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ఒక కొత్త ప్రాజెక్ట్‌ను లైన్ లోకి తెచ్చేలా అడుగులు వేస్తోంది. రవితేజ ఎనర్జీకి, మారుతి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మైత్రీ లాంటి పెద్ద బ్యానర్ తోడైతే ఆ ప్రాజెక్ట్ కూడా క్రేజీగా మారడం ఖాయం. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టులపై అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశముంది.





