
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న హై-వోల్టేజ్ బిగ్ ప్రాజెక్ట్ 'రాకా' గురించి ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాని ఒకే పార్ట్‌గా కాకుండా.. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే, మార్కెట్‌లో దీనికి ఉన్న హ్యూజ్ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని మేకర్స్ కోట్ చేసిన డిజిటల్ రైట్స్ నంబర్స్, ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ ఆఫర్ చేస్తున్న ఆఫర్లకు అంతగా మ్యాచ్ అవ్వలేదు. బడ్జెట్ రికవరీతో పాటు, బిజినెస్ పరంగా ప్రాజెక్ట్ రేంజ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలంటే కథని విస్తరించి రెండు భాగాలుగా తేవడమే పర్ఫెక్ట్ రూట్ అని టీమ్ ఫిక్స్ అయ్యిందట.
అట్లీ ఈ రెండు భాగాల ప్లాన్ గురించి అల్లు అర్జున్, అలాగే సన్ పిక్చర్స్ టీమ్‌తో డీటైల్డ్‌గా డిస్కస్ చేశారట. కథలోని డెప్త్, విజువల్ గ్రాండియర్ చూసిన తర్వాత అందరూ ఏకగ్రీవంగా ఈ రెండు భాగాల ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
సాధారణంగా రెండు భాగాల సినిమాలు అంటే ఏళ్ల తరబడి షూటింగ్స్ సాగుతూనే ఉంటాయి. కానీ 'రాకా' విషయంలో మాత్రం అలా జరగడం లేదు. మేకర్స్ వేసిన పక్కా స్కెచ్ ఏంటంటే... ఈ ఏడాది చివరి కల్లా 'రాకా' పార్ట్-1, పార్ట్-2 రెండింటి షూటింగ్‌ను కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్నారు.
షూటింగ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాతే గ్రాండ్‌గా ప్రమోషన్స్ అండ్ రిలీజ్ ప్లాన్ అనౌన్స్ చేయబోతున్నారు. షూటింగ్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా తన తదుపరి లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెడతారు. ఈలోగా డైరెక్టర్ అట్లీ 'రాకా' రెండు భాగాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మీద పూర్తిగా ఫోకస్ పెడతారు.
Allu Arjun, Atlee, Raaka Movie, Two Parts





