మరో తమిళ స్టార్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ!
on Nov 28, 2025

వరుసగా తమిళ డైరెక్టర్స్ తో అల్లు అర్జున్ సినిమాలు
ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో మూవీ
మరో తమిళ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్?
పుష్ప రాజ్ గా పాన్ ఇండియా వైడ్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. దీని తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో చేతులు కలుపుతాడనే ఆసక్తి నెలకొంది.
నిజానికి త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా వంటి డైరెక్టర్స్ తో అల్లు అర్జున్ సినిమాల ప్రకటనలు వచ్చాయి. కానీ, అవి పట్టాలెక్కే సూచనలు కనిపించడంలేదు. ఒకట్రెండు ఇతర దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. ఇక ఇప్పుడు లోకేష్ కనగరాజ్ పేరు బలంగా వినిపిస్తోంది.
Also Read: టాలీవుడ్ స్టార్స్ ఎలాంటివారో చెప్పిన నిర్మాత రవిశంకర్
తక్కువ సినిమాలతోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న లోకేష్.. గత చిత్రం 'కూలీ'తో అంతగా మెప్పించలేకపోయాడు. దీంతో కొన్ని ప్రాజెక్ట్ లకు బ్రేక్ లు పడ్డాయి. అందుకే సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలనే కసితో ఉన్నాడు.
ఈ క్రమంలోనే ఇటీవల లోకేష్.. అల్లు అర్జున్ ని కలిసి ఒక కథ వినిపించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో సినిమా చేయడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో లోకేష్ ఉన్నాడట.
అదే నిజమైతే.. పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన తర్వాత బన్నీ వరుసగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసినట్లు అవుతుంది.
ప్రస్తుతం కోలీవుడ్ లో అట్లీ, లోకేష్ స్టార్ డైరెక్టర్స్ గా ఉన్నారు. ఇప్పటికే అట్లీతో ఒక సినిమా చేస్తున్న అల్లు అర్జున్.. నెక్స్ట్ సినిమా లోకేష్ తో చేయనున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



