త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్.. పవన్ కళ్యాణ్ పనేనా..?
on May 16, 2025

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తదుపరి సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. త్రివిక్రమ్ గత చిత్రం 'గుంటూరు కారం' విడుదలై ఏడాది దాటిపోయింది. ఇంతవరకు కొత్త సినిమా పట్టాలెక్కలేదు. నిజానికి అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీని చేయాల్సి ఉంది. దీంతో పాన్ ఇండియా డైరెక్టర్ కావాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ, అట్లీ ప్రాజెక్ట్ తో అల్లు అర్జున్ బిజీ కావడంతో.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వెనక్కి జరిగింది. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మరో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. వెంకటేష్, శివకార్తికేయన్ వంటి హీరోల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా రామ్ చరణ్ (Ram Charan) పేరు తెరపైకి వచ్చింది. ఈ కాంబినేషన్ సెట్ అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ అని తెలుస్తోంది. (Pawan Kalyan)
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి సినిమాలు వచ్చాయి. పవన్ నటించిన పలు సినిమాలకు త్రివిక్రమ్ రచయితగానూ వ్యవహరించారు. సినిమాల పరంగానే కాకుండా, పర్సనల్ గానూ వీరి మధ్య మంచి బాండింగ్ ఉంది. తన మిత్రుడు పవన్ కోసం త్రివిక్రమ్ ఓ మంచి కథని సిద్ధం చేశాడట. అయితే ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్న పవన్.. కొత్త సినిమాలను కమిట్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే ఆ కథను చరణ్ తో చేయమని సూచించాడట. ప్రస్తుతం త్రివిక్రమ్-చరణ్ మధ్య కథా చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. అన్నీ అనుకున్నట్లు జరిగితే, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.
రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ తో ఓ మూవీ కమిటై ఉన్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే.. సుకుమార్ సినిమా వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చరణ్ తో సుకుమార్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ఫిల్మ్ ని ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాలేదు, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి చాలా సమయం పడుతుంది. అందుకే ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని చరణ్ చూస్తున్నాడట. అది త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం మొదలైంది. దీనిని త్రివిక్రమ్ తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



