'సలార్'లో కత్రినా ఐటమ్ సాంగ్!!
on Aug 2, 2021
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సలార్'. 'కేజీఎఫ్'తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేస్తున్న సినిమా కావడంతో 'సలార్'పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
సలార్ లో మాస్ ఆడియన్స్ ను మెప్పించే ఓ ఐటమ్ సాంగ్ ఉండనుందని తెలుస్తోంది. ఈ సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ సందడి చేయనుందని కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ని మూవీ టీమ్ సంప్రదించిందని టాక్ వినిపిస్తోంది. కత్రినా అయితే మరింత గ్లామర్ యాడ్ అవుతుందని భావించారని తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం ఆమెకి భారీ మొత్తంలో ఆఫర్ చేశారని, సాంగ్ చేయడానికి ఆమె కూడా గ్రీన్ ఇచ్చిందని సమాచారం.
హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ తాజాగా తిరిగి ప్రారంభమైంది.