భర్త మహాశయులకు విజ్ఞప్తి.. రవితేజ ఏం చేయబోతున్నాడు..?
on Oct 3, 2025

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తన 76వ సినిమాని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే స్పెషల్ వీడియోతో టైటిల్ ను రివీల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. (RT76)
రవితేజ తన 75వ సినిమా 'మాస్ జాతర'ను భాను బోగవరపు డైరెక్షన్ లో చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్, అక్టోబర్ 31న విడుదల కానుంది. అది విడుదలైన రెండు నెలల తర్వాత 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో థియేటర్లలో సందడి చేయనున్నాడు రవితేజ.
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ ని బట్టి చూస్తే.. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. భార్యల చేతిలో నలిగిపోయే భర్తల కథను వినోదభరితంగా చెప్పే అవకాశముంది. రవితేజ కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, కామెడీ టచ్ ఉన్న సినిమాలు తీయడంలో కిషోర్ తిరుమల దిట్ట. మరి ఈ ఇద్దరు కలిసి సంక్రాంతికి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
కాగా, 2026 సంక్రాంతికి ప్రభాస్ 'ది రాజా సాబ్', చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. మరి ఈ బాక్సాఫీస్ పోరులో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో మరో మూడు నెలల్లో తేలిపోతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



