'దసరా'బుల్లోడుగా నాని..!!
on Sep 16, 2021
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆయన 'టక్ జగదీష్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శ్యామ్ సింగరాయ్' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'అంటే సుందరానికి' అనే సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా నాని నెక్స్ట్ మూవీ కూడా త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
రీసెంట్ మీడియాతో మాట్లాడిన నాని.. దసరా నాటికి తన కొత్త సినిమా అనౌన్స్ చేస్తానని చెప్పారు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన శ్రీకాంత్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాకి 'దసరా' అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటిదాకా 'టక్ జగదీష్', 'శ్యామ్ సింగరాయ్', 'అంటే సుందరానికి' అంటూ డిఫరెంట్ టైటిల్స్ వైపు మొగ్గుచూపిన నాని.. ఈసారి మాత్రం అందరికి బాగా తెలిసిన పండగ పేరు 'దసరా'నే తన మూవీ టైటిల్ గా ఓకే చేశారని అంటున్నారు. అంతేకాదు ఈ మూవీ టైటిల్ తో పాటు నాని లుక్ ను కూడా దసరా రోజునే రివీల్ చేస్తారట.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ ప్రేమ కథగా ఈ సినిమాను రూపొందించనున్నారట. ఈ సినిమాలో నాని తెలంగాణ కుర్రాడిగా కొత్త లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
Also Read