మంగళగిరిలో 'దేవర' గ్రాండ్ సక్సెస్ మీట్.. గెస్ట్ నారా లోకేష్!
on Oct 1, 2024
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర' (Devara) బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టి.. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి.. రూ.500 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే కొన్ని చోట్ల లాభాల్లోకి ఎంటరైన దేవర.. ఈ రెండు రోజుల్లో దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి, క్లీన్ హిట్ గా నిలవనుంది. ఈ క్రమంలో భారీ ఎత్తున సక్సెస్ మీట్ ను ప్లాన్ చేస్తున్నారు. (Devara Success Meet)
గుంటూరు, విజయవాడ మధ్యలో మంగళగిరి దగ్గరలో దేవర సక్సెస్ మీట్ ను నిర్వహించనున్నారట. ఇప్పటికే అనుమతులు లభించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 4న ఈవెంట్ జరగనుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని సమీపంలో, అందునా ఓపెన్ గ్రౌండ్ లో అంటే.. లక్షల్లో అభిమానులు ఈ ఈవెంట్ కి తరలివచ్చే అవకాశముంది. అంతేకాదు, ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి నారా లోకేష్ హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది.
నిజానికి 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ లో అవుట్ డోర్ లో ఘనంగా చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ వర్షాలు, అనుమతులు వంటి కారణాల వల్ల.. ఇండోర్ కి షిఫ్ట్ చేశారు. హైదరాబాద్ లోని నోవొటెల్ లో 5000 మందితో ఈవెంట్ ప్లాన్ చేయగా, ఏకంగా 35 వేల మంది రావడంతో.. భద్రతా కారణాల దృష్ట్యా చివరికి ఈవెంట్ ని రద్దు చేశారు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో నిరాశచెందారు. అందుకే ఇప్పుడు సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
Also Read