Akhanda 2 : బాలయ్య 'అఖండ-2' వాయిదా.. కారణమిదే!
on Apr 6, 2025
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన 'అఖండ' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 'అఖండ 2' రూపొందుతోంది. ఓ వైపు బాలయ్య-బోయపాటి కాంబో, మరోవైపు 'అఖండ' సీక్వెల్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అఖండ-2 ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో నందమూరి ఫ్యాన్స్ కి షాకిచ్చే న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఈ మూవీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. (Akhanda 2 Thandavam)
14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రూపొందుతోన్న 'అఖండ-2' చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ క్రేజీ మూవీ, ఆ డేట్ కి రిలీజ్ కావడం కష్టమనే అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అఖండ-2 ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. హిమాలయాల్లో ఇంతవరకు ఎవరూ చూపించని సరికొత్త లొకేషన్లలో కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. అందుకే షూట్ కి అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు పట్టే అవకాశముందట. హడావుడిగా షూట్ ని పూర్తి చేసే కంటే, ఆలస్యంగా వచ్చినా అంచనాలకు మించిన అవుట్ పుట్ తో సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నారట. అందుకే సినిమాని డిసెంబర్ కి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అఖండ కూడా 2021 డిసెంబర్ లోనే విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేసింది. అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ.. ఇప్పుడు అఖండ-2ని కూడా 2025 డిసెంబర్ కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
