Home

»

Gossips

Peddi: సమ్మర్ రేసు నుంచి తప్పుకున్న పెద్ది.. రిలీజ్ వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా?

Apr 07, 2026

  • మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ 
  • 'పెద్ది' రిలీజ్ డేట్‌పై మళ్ళీ మొదలైన సస్పెన్స్!
  • కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ 'పెద్ది'(Peddi). ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పుడు మెగా అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. మొదట మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమా, కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా పడింది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఏప్రిల్ నెలలో కూడా 'పెద్ది' రావడం కష్టమే అనిపిస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, 'పెద్ది' మూవీ ఏప్రిల్ రేసు నుంచి తప్పుకుని జూన్ నెలకు వెళ్లే ఆలోచనలో ఉందట. రీసెంట్‌గా హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఎక్కడా విడుదల తేదీని ప్రస్తావించకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. 

ఇటీవల ఒక మూవీ ప్రమోషన్స్ సమయంలో చరణ్ మాట్లాడుతూ.. "టైంకి వస్తుందని చెప్పండ్రా" అని సరదాగా అన్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే జూన్ 26న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. రీసెంట్‌గా జరిగిన ఒక ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత ఎస్‌కెఎన్ కూడా 'పెద్ది' జూన్ 26కి వాయిదా పడిందనే విషయాన్ని హింట్ ఇచ్చారు. 

షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం, ప్రీ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటం, ప్రమోషన్స్ కి తగినంత సమయం లేకపోవడం వంటి కారణాలతో 'పెద్ది' విడుదలను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ సినిమాపై ఇంతటి హైప్ ఉండటానికి ప్రధాన కారణం ఇందులోని భారీ తారాగణం. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని 'చికిరి చికిరి', 'రయ్ రయ్ రా రా' వంటి పాటలు ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తున్నాయి.

చరణ్ ఈ సినిమాలో ఎన్నడూ చూడని విధంగా ఒక రగ్గడ్ లుక్‌లో కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 'రంగస్థలం' తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇదని మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com