కమల్, షారూక్, అభిషేక్.. వీరితో ఆ సినిమా చెయ్యొద్దు అనుకున్న ఆర్జీవీ.. ఎందుకని?
on Oct 3, 2024
అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమాలు చెయ్యాలంటే తన తర్వాతే ఎవరైనా అనే రేంజ్‌లో కొన్ని సినిమాలు తీసి బాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేశారు రామ్‌గోపాల్‌వర్మ. అలాంటి బ్యాక్‌డ్రాప్‌తో మొదట 1998లో ‘సత్య’ చిత్రాన్ని రూపొందించారు. బాలీవుడ్ ఆడియన్సే కాదు, దేశవ్యాప్తంగా అందరూ మెచ్చిన సినిమాగా ‘సత్య’ నిలిచింది. దానికి సీక్వెల్‌గా 2002లో ‘కంపెనీ’ చిత్రం వచ్చింది. దాన్ని కంటిన్యూ చేస్తూ 2005లో ‘డి’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలన్నీ ముంబయి మాఫియా నేపథ్యంలోనే నిర్మించారు. వీటిలో ‘కంపెనీ’ చిత్రానికి సంబంధించి కొన్ని విశేషాలు ఉన్నాయి.
ఏ దర్శకుడైనా తను చేసే సినిమాలోని క్యారెక్టర్లకు ఎవరు సూట్ అవుతారు, ఎవరైతే ఆ క్యారెక్టర్లకు న్యాయం చేయగలరు అనే విషయంలో ఒక జడ్జిమెంట్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే నటీనటుల ఎంపిక జరుగుతుంది. అలా ‘కంపెనీ’ చిత్రంలోని మూడు క్యారెక్టర్ల కోసం మొదట అనుకున్న నటులు వేరు, ఆ పాత్రలు పోషించిన నటులు వేరు. సినిమాలో ప్రధాన పాత్రగా కనిపించే మాలిక్ క్యారెక్టర్ కోసం మొదట షారూక్ ఖాన్‌ని అనుకున్నారు వర్మ. ఈ విషయంలో అతనితో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే చివరి క్షణంలో ఆ క్యారెక్టర్ కోసం అజయ్ దేవ్‌గణ్‌ని తీసుకున్నారు. షారూక్ హైపర్ యాక్టివ్‌గా కనిపించడమే దానికి కారణం. మాలిక్ క్యారెక్టర్ చాలా సైలెంట్‌గా ఉండే వయెలెంట్ క్యారెక్టర్. దానికి అజయ్ అయితే న్యాయం చెయ్యగలడు అనేది వర్మ అభిప్రాయం.
సినిమాలో ప్రధానంగా కనిపించే మరో క్యారెక్టర్ పోలీస్ కమిషనర్. అది కమల్‌హాసన్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు. కానీ, కమల్ బాడీ లాంగ్వేజ్ దృష్ట్యా పోలీస్ కమిషనర్ పాత్రకు సూట్ అవ్వడు అని డిసైడ్ అయ్యారు వర్మ. అప్పుడు అతని స్థానంలో మోహన్‌లాల్‌ని తీసుకున్నారు. సినిమాలో కీలకంగా ఉండే చంద్రకాంత్ క్యారెక్టర్ కోసం అభిషేక్ బచ్చన్‌ని అనుకున్నారు. క్యారెక్టర్ బాగా నచ్చడంతో అభిషేక్ కూడా చేసేందుకు రెడీ అయ్యారు. అయితే అప్పటికే కొన్ని సినిమాలతో బిజీగా ఉన్న అభిషేక్.. వర్మ చెప్పిన డేట్స్ క్లాష్ అవ్వడంతో డ్రాప్ అయ్యాడు. అప్పుడు ఆ క్యారెక్టర్‌లోకి వివేక్ ఓబెరాయ్ ఎంటర్ అయ్యాడు. అలా మొదట అనుకున్న షారూక్ ఖాన్, కమల్‌హాసన్, అభిషేక్ బచ్చన్‌లను తప్పించి ఆ స్థానాల్లో అజయ్ దేవ్‌గణ్, మోహల్‌లాల్, వివేక్ ఓబెరాయ్‌లను దించారు వర్మ. సినిమా రిలీజ్ అయిన తర్వాత వర్మ డెసిషన్ కరెక్టే అని ప్రూవ్ అయింది. ఈ ముగ్గురూ తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. వర్మ కెరీర్‌లో ‘కంపెనీ’ చిత్రానికి ఓ విశిష్టమైన స్థానం ఉంది. ముంబయి మాఫియాను యధాతథంగా చూపించడంలో వర్మ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు.
Also Read