రవితేజ టాప్-10 మూవీస్.. మీ ఫేవరెట్ ఏది..?
on Jan 25, 2025
మాస్ మహారాజ రవితేజ సినీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ గా ఎదిగాడు. మూడు దశాబ్దాలకు పైగా సినీ జర్నీతో 74 సినిమాలు చేశాడు రవితేజ. త్వరలో తన 75వ సినిమా 'మాస్ జాతర'తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. జనవరి 26న రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కెరీర్ లో టాప్ సినిమాలను గుర్తు చేసుకుందాం. (Ravi Teja)
సింధూరం:
అప్పటివరకు సహాయక పాత్రల్లో నటించిన రవితేజ, తొలిసారి బ్రహ్మాజీతో కలిసి హీరోగా నటించాడు. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1997 లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నటుడిగానూ రవితేజకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది.
ఇడియట్:
'నీ కోసం' సినిమాతో సోలో హీరోగా మారిన రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన చిత్రమంటే 'ఇడియట్' అని చెప్పవచ్చు. 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' తర్వాత రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఇది. 'ఇడియట్' సినిమా అప్పటి కుర్రకారుని ఒక ఊపు ఊపి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే యూత్ లో, మాస్ లో రవితేజకు తిరుగులేని ఫాలోయింగ్ ని తీసుకొచ్చింది.
ఖడ్గం:
సింధూరం, సముద్రం తర్వాత రవితేజ-కృష్ణవంశీ కలయికలో వచ్చిన చిత్రం 'ఖడ్గం'. ఈ చిత్రం నటుడిగా రవితేజను మరో మెట్టు ఎక్కించింది. 'ఖడ్గం' చిత్రానికి రవితేజ నంది స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా అందుకున్నాడు.
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి:
'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం', 'ఇడియట్' తర్వాత రవితేజ, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి'. ఈ స్పోర్ట్స్ డ్రామాలో రవితేజ పోషించిన చందు పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రవితేజ అల్లరి, ఆటిట్యూడ్ యూత్ ని కట్టిపడేశాయి.
వెంకీ:
రవితేజ కెరీర్ లో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాలలో 'వెంకీ' ఒకటి. 'నీ కోసం' తర్వాత రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఇది. 'వెంకీ' సినిమా ప్రేక్షకులను ఎంతగానో నవ్వించి, బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా, ఇందులోని కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ఎందరికో ఫేవరెట్.
భద్ర:
బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయమైన చిత్రం 'భద్ర'. కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నీ సమపాళ్లలో ఉండేలా బోయపాటి రూపొందిన ఈ చిత్రం.. రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.
విక్రమార్కుడు:
రవితేజ ద్విపాత్రాభినయం పోషించిన విక్రమార్కుడు సినిమాకి ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించాడు. అత్తిలి సత్తిబాబుగా, విక్రమ్ సింగ్ రాథోడ్ గా పూర్తి వైవిధ్యమున్న పాత్రల్లో రవితేజ నటనను అంత తేలికగా మరచిపోలేము.
కృష్ణ:
వెంకీ తర్వాత రవితేజ ఆ స్థాయిలో నవ్వులు పంచిన చిత్రం 'కృష్ణ'. వి.వి. వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బ్రహ్మానందంతో కలిసి కుడుపుబ్బా నవ్వించాడు రవితేజ.
నేనింతే:
నటుడిగా రవితేజ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలలో 'నేనింతే' ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ నటన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈ చిత్రానికి గాను ఆయన ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నాడు.
కిక్:
రవితేజ ఎనర్జీని, కామెడీ టైమింగ్ ని పూర్తి స్థాయిలో వాడుకున్న సినిమాల్లో 'కిక్' ముందు వరుసలో ఉంటుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ లో రవితేజ చేసిన అల్లరికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
వీటితో పాటు 'ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు', 'నా ఆటోగ్రాఫ్', 'దుబాయ్ శీను', 'శంభో శివ శంభో', 'మిరపకాయ్' ఇలా రవితేజ నటించిన పలు సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. మరి వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
