Home

»

Featured News

‘పాతాళభైరవి’కి మొదట అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదు!

Mar 14, 2026

నటరత్న ఎన్.టి.రామారావు కెరీర్‌ని టర్న్ చేసిన సినిమా, ఆయన్ని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ‘పాతాళభైరవి’(Pathala Bhairavi). 1951 మార్చి 15న విడుదలైన ఈ సినిమా ఈ ఏడాదికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌లా నిలిచిపోయిన ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.

‘పాతాళభైరవి’ చిత్రంలో ఎన్టీఆర్ తోటరాముడుగా నటించారు. అయితే ఈ సినిమాలో మొదట అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదు. ఇద్దర్ని దాటుకొని ఆయనకు ఆ అవకాశం వచ్చింది. అప్పటికే జానపద హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఎఎన్నార్‌ను తీసుకోవాలనుకున్నారు కె.వి.రెడ్డి. కానీ, నాగిరెడ్డి, చక్రపాణి మాత్రం ఎన్టీఆర్ అయితే బాగుంటుంది అన్నారు. అయితే వారిద్దర్నీ కాదని కాకినాడకు చెందిన వై.రాజారెడ్డిని తోటరాముడు క్యారెక్టర్‌కి ఎంపిక చేశారు. మేకప్ టెస్ట్ చేసి రిహార్సల్స్ కూడా చేయించారు. అయితే ఆయనకు కాస్త నత్తి ఉండడం వల్ల ఆ అవకాశం ఎన్టీఆర్‌ను వరించింది. ‘పాతాళభైరవి’తో ఎన్టీఆర్ స్టార్ హీరో అయిపోయారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com