బాలీవుడ్ కమెడియన్.. మధ్యంతర బెయిల్‌కి ఎంత డిపాజిట్ చేశాడో తెలిస్తే షాక్ అవుతారు
on Feb 16, 2026
ఇటీవలికాలంలో బాలీవుడ్లో కలకలం రేపిన ఓ కేసులో కమెడియన్‌కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. చెక్‌బౌన్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్‌ను తీహార్ జైలుకి తరలించిన విషయం తెలిసిందే. 11 రోజులపాటు ఆయన జైలులో ఉన్నారు. తాజాగా ఢిల్లీ హైకోర్టు రాజ్‌పాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనికి కఠినమైన షరతులు విధించింది. 9 కోట్ల రూపాయల చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్న రాజ్‌పాల్ గత వారం బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. అయితే కోర్టు దీన్ని తిరస్కరించింది.
తాజాగా ఫిబ్రవరి 16న కొన్ని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అవేమిటంటే.. కోటిన్నర రూపాయల డిపాజిట్‌ను డి.డి.రూపంలో కోర్టుకు అందజేయాలి. రాజ్‌పాల్ పాస్‌పోర్టును కూడా కోర్టుకు సమర్పించాలి. అంతేకాదు, తదుపరి వాయిదా తప్పనిసరిగా హాజరు కావాలి. వీ{న్నింటికీ ఒప్ప్పుకున్న తర్వాత ఆయనకు మార్చి 18 వరకు బెయిల్‌ను మంజూరు చేశారు. కోర్టు ఆదేశించిన మేరకు కోటిన్నర డిపాజిట్‌తోపాటు పాస్ట్‌పోర్ట్‌ను సమర్పించారు రాజ్‌పాల్.
1999లో బాలీవుడ్లో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రాజ్‌పాల్ యాదవ్ 2010లో ‘అటపటా లపాటా’ అనే సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. 2012లో విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా నిర్మాణం నిమిత్తం 5 కోట్ల రూపాయలు ఫైనాన్స్ తీసుకున్నారు రాజ్‌పాల్. ఆ డబ్బును తిరిగి చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. ఆయన ఫైనాన్షియర్స్‌కి ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం కింద కేసు నమోదైంది. వడ్డీలతో సహా ఆ రుణం 9 కోట్లకు పెరిగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



