ఆ హీరోతో డేట్ చేసానా! అతను నాభర్తకి మంచి స్నేహితుడు
on Dec 28, 2024
విక్టరీ 'వెంకటేష్'(venkatesh)హీరోగా తెరకెక్కిన 'ప్రేమంటే ఇదేరా' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన భామ ప్రీతిజింతా(preity zinta).ఆ తర్వాత 'మహేష్ బాబు'(mahesh babu)ఫస్ట్ మూవీ 'రాజకుమారుడు'లో కూడా అధ్బుతమైన పెర్ఫార్మెన్స్ తో అలరించింది.బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్(salman khan),షారుక్(sharukh khan)హృతిక్ రోషన్(hrithik roshan)వంటి బడా హీరోలతో కూడా జత కట్టి క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది.ప్రస్తుతం 'లాహార్ 1947 ' అనే మూవీ కోసం వర్క్ చేస్తుంది.
నిన్న (డిసెంబర్ 27 ) సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రీతిజింతా 'ఎక్స్' వేదికగా స్పందిస్తు 'హ్యాపీ బర్త్ డే సల్మాన్,లవ్ యూ మోస్ట్.మిగిలిన విషయాలు మనం కలిసినప్పుడు చెప్తాను.మనం కలిసి ఎన్నో ఫోటోలు దిగాలి.లేదంటే పాత ఫోటోలని ప్రతిసారి పోస్ట్ చెయ్యాల్సి వస్తుందంటు ట్వీట్ చేసింది.ఇప్పుడు ఈ ట్వీట్ పై ఒక నెటిజెన్ స్పందిస్తు మీ ఇద్దరు ఎప్పుడైనా డేట్ లో ఉన్నారా అని అడగటం జరిగింది.దీనికి ప్రీతి బదులిస్తు సల్మాన్ నేను ఎప్పుడు కూడా డేట్ చెయ్యలేదు. సల్మాన్ నాకు కుటుంబ సభ్యుడుతో సమానం.నా భర్తకు కూడా మంచి స్నేహితుడు.నా సమాధానంతో మీరు ఆశ్చర్య పోతే నన్ను క్షమించండంటూ ట్వీట్ చేసింది.
ఇప్పుడు ఈ విషయం మొత్తం వైరల్ గా నిలవడమే కాకుండా పెళ్లి అయిన తర్వాత ఒక నటిని ఇలాంటి ప్రశ్నలు వెయ్యడం తప్పంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ప్రీతిజింతా, సల్మాన్ లు 'హర్ దిల్ జో ప్యార్ కరేగా','చోరీ చోరీ చుప్ కే చుప్ కే' వంటి చిత్రాల్లో కలిసి నటించారు.
Also Read