
బాలీవుడ్ లో తనదైన హవా చాటుతూ స్టార్ మెటీరియల్ గా పిలవడానికి కూతవేటు దూరంలో ఉన్న కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan)రీసెంట్ గా 'చందు ఛాంపియన్' మూవీకి నేషనల్ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ఆషీకీ పార్ట్ 2 తో పాటు పలు చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. అస్సాం రాష్ట్రంలోని ప్రజలు ప్రస్తుతం తీవ్రమైన వరదలతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.
లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులై అల్లాడుతున్నారు. ఇలాంటి అత్యంత క్లిష్టమైన సమయంలో కార్తీక్ ఆర్యన్ ముందుకొచ్చి అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి భారీ విరాళాన్ని అందజేశాడు. ప్రకృతి విపత్తుతో ప్రాణాలు, నివాసాలు కోల్పోయి విలవిలలాడుతున్న వేలాది మంది బాధితులకు బాసటగా నిలిచేందుకు ఆ ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ఎంతోమంది హృదయాలని గెలుచుకున్నాడు. స్క్రీన్ పైనే కాదు, నిజ జీవితంలోనూ రియల్ హీరో అని అభిమానులు కొనియాడుతున్నారు.
also read: శ్రీనివాస మంగాపురం బాక్సాఫీస్ డే 1 వసూళ్ల తుఫాన్!
కార్తీక్ ఆర్యన్ చేసిన సాయంపై అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ ఎక్స్ వేదికగా స్పందిస్తు మీరు అందించిన 1 కోటి ఆర్థిక సాయం వరద బాధితులకి పునరావాసం కల్పించడంలోనూ, వారికి అవసరమైన అత్యవసర సాయం అందించడంలోనూ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. "మీరు అందించిన ఈ గొప్ప విరాళం అస్సాం ప్రజలకు ఎంతో మేలు చెయ్యడంతో పాటు నా హృదయాన్ని తాకింది" అంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. ఇక మరికొంత మంది హీరోలు కూడా కార్తీక్ ఆర్యన్ లా సాయం ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది.
kartik Aaryan, Odissa, Bollywood





