
కొన్ని కేసులు ఊహించని మలుపులు తిరుగుతూ ఉంటాయి. కానీ నిజం అనేది ఏదో ఒకరోజు తేలకపోదు. అందరి అంతు చూడకపోదు. ఎందుకంటే 'సత్యం' అనేది అన్నిటికంటే పెద్ద తెలివైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ దిశా సాలియన్ కేసు వాళ్ళ పై మాటలు చెప్పుకోవాల్సి వస్తుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సున్నితమైన అంశంపై ఇప్పుడు ఒక సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది.
దిశా సాలియన్ తండ్రి పేరు సతీష్ సాలియన్. అయన శివసేన (యుబిటి) యువ నేత, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేతో పాటు మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌లకు ఏకంగా రూ.500 కోట్ల రూపాయల భారీ నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో సతీష్ సాలియన్ న్యాయపోరాటానికి దిగడం కేసు స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసింది.తన కుమార్తె మరణం తర్వాత తమ కుటుంబ గౌరవానికి, ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా ప్రచారాలు జరిగాయని, రాజకీయ ప్రయోజనాల కోసం తమ వ్యక్తిగత జీవితాన్ని బలిచేశారని దిశా తండ్రి ఆరోపిస్తున్నారు. దీని కారణంగానే తమ కుటుంబానికి తీవ్ర మానసిక క్షోభ, సామాజిక అవమానం ఎదురైందని, ఈ నేపథ్యంలోనే తమ ప్రతిష్టను దిగజార్చినందుకు గాను ఆదిత్య ఠాక్రే మరియు అనిల్ దేశ్‌ముఖ్ .500 కోట్ల పరిహారం చెల్లించాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసుల్లో డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ తీవ్రమైన ఆరోపణలు, లీగల్ నోటీసులపై శివసేన యుబిటి నేత ఆదిత్య ఠాక్రే వెంటనే స్పందించారు. తనపై వస్తున్న విమర్శలు, నోటీసులలోని అంశాలు పూర్తిగా వాస్తవ దూరమని ఆయన ఖండించారు. అసలు దిశా సాలియాన్ ఎవరో కూడా తనకు తెలియదని, తాను ఆమెను జీవితంలో ఒక్కసారి కూడా కలవలేదని ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు. కేవలం రాజకీయంగా తమ ప్రభుత్వాన్ని, తన ఇమేజ్‌ను దెబ్బతీయడానికే ప్రత్యర్థులు వెనుక ఉండి ఈ కుట్రలు పన్నుతున్నారని ఆయన ఎదురుదాడికి దిగారు.దిశా సాలియన్ మృతి చెంది ఇన్ని సంవత్సరాలు గడిచినా, ఈ వ్యవహారం ముగిసిపోకుండా మరింత సంక్లిష్టంగా మారుతోంది. రాబోయే రోజుల్లో కోర్టు పరిధిలో ఈ లీగల్ నోటీసు ఏ మలుపు తీసుకుంటుందో, దిశా కేసు ఎలాంటి కొత్త నిజాలను బయటకు తెస్తుందో వేచి చూడాలి.

Also Read: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య: వైష్ణవి హత్యకి ప్రతీకారంగానే జరిగిందా!
2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనం నుండి పడి దిశా సాలియన్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆ సంఘటన జరిగిన కేవలం ఆరు రోజుల్లోనే, జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన నివాసంలో మృతి చెందడంతో ఈ రెండు సంఘటనల వెనుక లోతైన సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ సమయం నుండి ఈ ఉదంతం చుట్టూ అనేక రకాల ఊహాగానాలు, రాజకీయ విమర్శలు నడుస్తూనే ఉన్నాయి. దిశా సాలియన్ ఆల్కహాల్ తాగిన మత్తులోనే కిందపడి మరణించిందని సిబిఐ పేర్కొంది.
[Disha Salan, Disha Salian Case Aaditya Thackeray 500 Crore Notice, Aaditya Thackeray, Sushant Singh Rajput, Bollywood, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]




