ధర్మేంద్ర ప్రస్థానం.. 19 ఏళ్ళకు మొదటి పెళ్ళి.. 50 రూపాయలు మొదటి సంపాదన!
on Nov 24, 2025

ధర్మేంద్ర అద్భుత ప్రయాణం
చిన్న గ్రామం నుండి బాలీవుడ్ స్టార్ దాకా
19 ఏళ్ళకు మొదటి పెళ్ళి
50 రూపాయలు మొదటి సంపాదన
ప్రస్తుత ఆస్తి ఎన్ని వందల కోట్లంటే..?
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(Dharmendra) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నవంబర్ 24న తుదిశ్వాస విడిచారు. హ్యాండ్సమ్ హీరోగా, యాక్షన్ కింగ్ గా, హీ మ్యాన్ గా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న ధర్మేంద్ర సినీ ప్రయాణం అడుగడుగునా ఓ అద్భుతం. 50 రూపాయల రెమ్యూనరేషన్ తో నట ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ధర్మేంద్ర జీవితంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి.
ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కేవల్ క్రిషన్ డియోల్. 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లోని లుధియానా జిల్లా నస్రాలీ గ్రామంలో జన్మించారు. 19 ఏళ్ళ వయసులో 1954లో ప్రకాష్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం నటుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టిన ధర్మేంద్ర.. మొదట చిన్న చిన్న పాత్రలు చేశారు.
1960లో వచ్చిన 'దిల్ భి తేరా హమ్ భి తేరే' చిత్రం ద్వారా ధర్మేంద్ర సినీ ప్రస్థానం మొదలైంది. 'షోలా ఆర్ షబ్నమ్' ఆయనకు మొదటి విజయాన్ని అందించింది. 1964లో విడుదలైన 'ఆయీ మిలన్ కి బేలా'తో ధర్మేంద్ర కెరీర్ ఊపందుకుంది. అదే ఏడాది వచ్చిన 'హఖీఖత్'తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అక్కడి నుండి వరుస సినిమాలతో రొమాంటిక్ హీరోగా, యాక్షన్ హీరోగా తనదైన ముద్ర వేశారు.

Also Read: ధర్మేంద్ర మృతి పట్ల చిరంజీవి సంతాపం!
ఇక 1975లో వచ్చిన 'షోలే' సినిమా ఒక చరిత్ర. అమితాబ్ బచ్చన్ తో కలిసి ధర్మేంద్ర నటించిన ఈ చిత్రం.. ఇండియన్ సినీ చరిత్రలో ఆల్ టైం క్లాసిక్ గా నిలిచింది.
ధర్మేంద్ర హీరోగా నటిస్తున్న సమయంలో.. ప్రపంచంలోనే టాప్-7 హ్యాండ్సమ్ హీరోలలో ఒకరిగా ఆయన నిలవడం విశేషం.
65 సంవత్సరాలపాటు నటుడిగా కొనసాగిన ధర్మేంద్ర.. 300కిపైగా సినిమాల్లో నటించి భారతీయ అత్యుత్తమ నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.
ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య ప్రకాష్ కౌర్ కు నలుగురు సంతానం. వారిలో సన్నీ డియోల్, బాబీ డియోల్ కూడా బాలీవుడ్‌లో మంచి నటులుగా పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో డ్రీమ్‌గర్ల్‌గా పేరు తెచ్చుకున్న హేమమాలిని 1980లో ధర్మేంద్ర రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు.
నటుడిగా ధర్మేంద్ర అందుకున్న మొదటి రెమ్యూనరేషన్ 50 రూపాయలు. సినిమాల్లో స్టార్ గా ఓ వెలుగు వెలిగిన ఆయన నెట్ వర్త్ దాదాపు 500 కోట్లు ఉంటుందని అంచనా. ఆయన కుటుంబసభ్యుల మొత్తం ఆస్తి కలిపి వెయ్యి కోట్లకు పైగా ఉంటుందట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



