Home

»

Bollywood News

రెండు గంటల్లో ఐదు సినిమాలు చేసిన అమితాబ్ బచ్చన్.. ఇండస్ట్రీని పాడు చేస్తున్నాడా!

Jun 13, 2025

భారతీయ చిత్ర పరిశ్రమలో 'బిగ్ బి అమితాబచ్చన్'(Amitabh Bachchan)కి ఉన్న స్థానాన్ని ఎవరు అందుకోలేరు. ఐదున్నర దశాబ్దాల నుంచి న టిస్తూ ఎంతో మంది నటులకి ఆదర్శంగా నిలుస్తున్నారు. బహుశా అన్ని దశాబ్దాల నుంచి నటనని కొనసాగిస్తున్న హీరో  వరల్డ్ సినీ చరిత్రలోనే మరొకరు లేరని చెప్పుకోవచ్చు. వాణిజ్య ప్రకటనల్లోను తన సత్తా చాటుతు వస్తున్నాడు.

అమితాబ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటాడనే విషయం తెలిసిందే. రీసెంట్ గా తన బ్లాగ్ లో రాసుకొస్తు 'కేవలం రెండు గంటల్లో ఐదు సినిమాలు, రెండు ఫోటోషూట్ లు కోసం వర్క్ చేశాను. వాణిజ్య ప్రకటనలే అయినప్పటికీ త్వరగా పూర్తి చేయడం సంతోషంగా అనిపించింది. నా స్పీడ్ చూసి డైరెక్టర్ సిబ్బంది షాక్ అయ్యి వర్క్ చేసే విధానాన్ని పాడు చేస్తున్నానేమో అని సరదాగా అన్నారు. నేను మాత్రం సినిమా కార్మికులు శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా పని చేస్తాను. కెరీర్ ని ప్రారంభించినప్పట్నుంచి పరిశ్రమలో ఎన్నో మార్పులు చూశానని రాసుకొచ్చాడు.

ఎనభై రెండేళ్ల వయసు గల అమితాబ్ గత ఏడాది వేట్టయ్యన్, కల్కి 2898 ఏడి  'లాంటి చిత్రాల్లో మెరిశాడు. ప్రస్తుతం రణబీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా చేస్తున్న 'రామాయణ'(Ramayana)లో జటాయువు అనే క్యారక్టర్ ని పోషిస్తున్నాడు. 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com