కలెక్షన్స్ ని ఆ విధంగా లెక్కించకండి
on Jan 6, 2025

ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar)ఇటీవల వరుస పరాజయాలని చవి చూస్తున్నాడు.ఎన్నో ఆశలతో చేసిన ఓఏంజీ 2 ,మిషన్ రాణి గంజ్,బడే మీయాన్,చోటే మియాన్,సర్ఫిరా,ఖేల్ ఖేల్ మెయిన్,ఇలా వరుస పరాజయాలని చవి చూసీ హిట్ కి చాలా దూరంగా ఉంటు వస్తున్నాడు.ప్రస్తుతం 'స్కై ఫోర్స్'(Sky Force)అనే విభిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.1965 లో ఇండియా,పాకిస్థాన్ మధ్య జరిగిన ఎయిర్ వార్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 24 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో అక్షయ్ కుమార్ మాట్లాడుతు భాషా పరంగా సినిమాని విడదీయకండి.ఏ భాషా చిత్రం అయినా కుడా దాన్ని భారతీయ సినిమాగానే గుర్తించాలి.కలెక్షన్లు కూడా ఒక లాంగ్వేజ్ లో 800 కోట్లు వచ్చాయని,ఇంకో చోట 500 కోట్లు వచ్చాయని కూడా చెప్పకుండా మొత్తం 1300 కోట్లు వసూలు చేసిందని చెప్పాలి.అంతే కానీ విడదీయకండానే వ్యాఖ్యలు చేసాడు.

ఇపుడు అక్షయ్ చేసిన ఈ వ్యాఖ్యలని 'గేమ్ చెంజర్'(Game changer)ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్(Pawan Kalyan)చేసిన వ్యాక్యలతో పోలుస్తున్నారు.గేమ్ చేంజర్ ఈవెంట్ లో పవన్ మాట్లాడుతు ఎవరు కూడా టాలీవుడ్,బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ అని అనకండి ఎందుకంటే ఇప్పడు ఉన్నది భారతీయ సినిమా అని చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



