కొడుక్కి బెయిల్ వచ్చిందని తెలియగానే భావోద్వేగంతో కుప్పకూలిన షారుక్ భార్య!
on Oct 29, 2021
దాదాపు మూడు వారాలు జైలులో గడిపాక షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతుల కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి విడుదలవుతున్నాడు. క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో అరెస్టయిన ఆర్యన్‌కు బాంబే హైకోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కండిషన్లతో ఈరోజు పూర్తి బెయల్ ఆర్డర్‌ను కోర్టు విడుదల చేసింది. కాగా హైకోర్టు జస్టిస్ సాంబ్రే తన తీర్పును వెలువరిస్తూ బెయిల్ మంజూరు చేసిన వార్త బయటకు రాగానే, గౌరీ ఖాన్ బాగా ఎమోషనల్ అయిపోయి ఇంట్లో కుప్పకూలిపోయారని ఇండియా టుడే రాసింది. అలాగే షారుక్‌కు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి లాంటి యాక్టర్లు ఫోన్ చేశారు.
ఇండియా టుడే కథనం ప్రకారం, అరెస్టయిన 25 రోజులకు ఆర్యన్‌కు బెయిల్ లభించిందని తెలిసిన వెంటనే గౌరీ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మోకాళ్లమీద ఫ్లోరింగ్ మీద కుప్పకూలిన ఆమె, కన్నీళ్లు పెట్టుకుంటూ, దైవప్రార్థన చేశారు. తన సెలబ్రిటీ ఫ్రెండ్స్ మహీప్ కపూర్ (సంజయ్ కపూర్ భార్య), సీమా ఖాన్ (సొహైల్ ఖాన్ భార్య) ఫోన్లు చేసి పలకరించగా ఏడ్చేశారు. షారుక్ కూతురు సుహానా ఖాన్.. యు.ఎస్., యు.కె.లలో ఉన్న ఆర్యన్ ఫ్రెండ్స్‌కు కాల్ చేసి, ఇటీవల వారిచ్చిన సపోర్టుకు థాంక్స్ చెప్పింది.
ఆర్యన్ బెయిల్ విచారణ తర్వాత తన లీగల్ టీమ్‌తో షారుక్ ఖాన్ మాట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొడుక్కు బెయిల్ వచ్చిందనే ఆనందం ఆయన ముఖంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్యన్‌కు బెయిల్ వచ్చిందనే ఆనందంతో షారుక్ ఫ్యాన్స్ పలువురు ఆయన ఇల్లు మన్నత్ దగ్గరకు వచ్చి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, 'Welcome Home Prince Aryan Khan' అనే బ్యానర్ ప్రదర్శించారు.
Also Read