జైలులో ఫస్ట్ టైమ్ కొడుకును కలిసిన షారుక్ ఖాన్!
on Oct 21, 2021
ముంబై ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న 23 సంవత్సరాల కొడుకు ఆర్యన్ ఖాన్ను చూసేందుకు నేటి ఉదయం షారుక్ ఖాన్ అక్కడకు వెళ్లాడు. క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో నిందితుడైన ఆర్యన్ అక్టోబర్ 8 నుంచి ఆ జైలులో గడుపుతున్నాడు. నిన్న ముంబై కోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది. అక్టోబర్ 2న ముంబై నుంచి గోవాకు బయలుదేరిన క్రూయిజ్ నౌకలో జరుగుతున్న రేవ్ పార్టీపై ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) దాడి చేసి అరెస్ట్ చేసిన తర్వాత కొడుకు ఆర్యన్ను షారుక్ కలుసుకోవడం ఇదే మొదటిసారి.
55 ఏళ్ల షారుక్ జైలులో సుమారు 20 నిమిషాలు గడిపాడు. కొవిడ్ మహమ్మారి కారణంగా జైళ్లలో విధించిన నిబంధనలను మహారాష్ట్ర ప్రభుత్వం సడలించడంతో షారుక్ అక్కడకు వెళ్లాడు. రెండు సార్లు బెయిల్ నిరాకరణకు గురైన ఆర్యన్ ఖాన్ బాంబే హైకోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. అతని జుడిషియల్ కస్టడీ నేటితో ముగియనున్నది. పోయిన శుక్రవారం వీడియో కాల్ ద్వారా తల్లితండ్రులతో ఆర్యన్ మాట్లాడాడు.
ఆర్యన్ వాట్సాప్ చాట్స్ అక్రమ మాదకద్రవ్యాల కార్యకలాపాలలో అతని ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలియజేస్తున్నాయని చెబుతూ ముంబైలోని ఒక స్పెషల్ కోర్టు నిన్న బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
